Friday, 3 September 2021

పెళ్లిపై నోరు విప్పిన విష్ణుప్రియ.. ‘అయ్యగారి’పై కన్ను.. కోరికలు మామూలుగా లేవు!

విష్ణుప్రియ సోషల్ మీడియాలో చేసే అల్లరి గురించి అందరికీ తెలిసిందే. ఇక ఆమె తన క్రష్ గురించి చెప్పిన విషయాలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. ఓ సారి సుమ క్యాష్ షోలో విష్ణుప్రియ చెప్పిన విశేషాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. విష్ణుప్రియకు ఇష్టమైన సెలెబ్రిటీల గురించి శ్రీముఖి నోరు విప్పారు. అలా విష్ణుప్రియ క్రష్ ఎవరో, ఎవరి మీద ప్రేమ ఉందో అన్ని విషయాలు బయటకు వచ్చాయి. విష్ణుప్రియకు నవదీప్ అంటే పిచ్చి అని. అతని ఇంటికి కూడా వెళ్లిందని శ్రీముఖి చెప్పేశారు. నవదీప్ అంటే క్రష్ అని విష్ణుప్రియ కూడా చెప్పేశారు. కానీ తనకు మాత్రం అంటే ప్రేమ అని.. ఎన్నో సందర్భాల్లో విష్ణుప్రియ తెలిపారు. అఖిల్ చేసే పోస్ట్‌లకు విష్ణుప్రియ కచ్చితంగా కామెంట్లు పెడుతుంటారు. లవ్ సింబల్స్‌తో ఆమె పెట్టే కామెంట్లు బాగానే వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా విష్ణుప్రియ తన పెళ్లి గురించి నోరు విప్పారు. తన యూట్యూబ్ చానెల్‌లో మా వంట మీ ఇంట అనే ప్రోగ్రాంను చేశారు. మా వంట మీ ఇంట అనే ప్రోగ్రాంకు సుధీర్ మరదలు రమ్య గెస్టుగా వచ్చారు. రమ్య అడిగిన ప్రశ్నకు సమాధానంగా పెళ్లిపై నోరు విప్పారు విష్ణుప్రియ. ‘అఖిల్ అక్కినేని ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడే పెళ్లి చేసుకుంటాను. ఆయన్నే పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు ఈ మాటలు ఆయన ఫ్యాన్స్ వింటే.. నన్ను ఏసుకుంటారు.. నీ మొహానికి ఆయన అవసరమా? అని అంటారు. అఖిల్ పోస్ట్‌లకు నేను కామెంట్ చేస్తేనే.. మా అయ్యగారిని వదలవా? అని ఫ్యాన్స్ ఆడుకుంటారు. నాకు దేవుడు లాంటి మంచి మనిషి దొరికినప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను. అఖిల్‌కు మంచి అమ్మాయి రావాలి.. దేవత లాంటి అమ్మాయి రావాలి.. ఆ దేవతను నేనే కావాలి’ అంటూ ఇలా తన మనసులోని కోరికను విష్ణుప్రియ బయటపెట్టేశారు. పెళ్లి చేసుకుని ఫారిన్ వెళ్లి రెండేళ్లు అక్కడే ఎంజాయ్ చేయాలని ఉందంటూ విష్ణుప్రియ తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BEO2lv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...