Saturday, 4 September 2021

‘వినాయకుడు’ ఫేమ్ కృష్ణుడు అరెస్ట్.. హాట్ టాపిక్ అవుతున్న ఇష్యూ

హీరో, కమెడియన్, ఆర్టిస్ట్ అయిన ఎప్పుడూ కూడా వివాదాలతో వార్తల్లోకెక్కుతుంటారు. ఆ మధ్య ఓ లేడీ చేసిన ఆరోపణలతో నెట్టింట్లో వైరల్ అయ్యారు. ఇక ఇప్పుడు పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిపోయారట. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శిల్పాపార్క్ విల్లాలో పేకాట ఆడుతున్న కృష్ణుడును ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిర్వాహకుడు పెద్ది రాజుతో పాటు మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం అర్థరాత్రి పేకాట స్థావరాలపై దాడులు చేసిన పోలీసులు..ఈ విషయాన్ని బయటకు రానివ్వలేదని తెలుస్తోంది. కానీ ఇప్పుడు ఈ వార్తలు సోషల్ మీడియాను ఊపేస్తోన్నాయి. కృష్ణుడు ఎప్పుడూ కూడా ఇలాంటి వివాదాలతోనే వార్తల్లో నిలుస్తుంటారు. హ్యాపీడేజ్, వినాయకుడు, విలేజ్‌లో వినాయకుడు వంటి సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న వినాయకుడు ఇప్పుడు అంతగా ఆకట్టుకోలేకపోతోన్నారు. ఇక సినీ కెరీర్ అంతంత మాత్రంగానే ఉన్న ఇలాంటి తరుణంలో వివాదాలతో మరింతగా ఫేమస్ అవుతున్నారు. ఆ మధ్య ఓ మహిళ చేసిన తప్పుడు ఆరోపణలతో కృష్ణుడు పేరు మార్మోగిపోయింది. రేప్ ఆరోపణలతో కృష్ణుడు హాట్ టాపిక్‌గా మారిపోయారు. ఇక ఇప్పుడు ఈ పేకాట కేసులో కృష్ణుడు పేరు వినిపిస్తోంది. నిన్న రాత్రి ఈ ఘటన జరిగినా కూడా ఎవ్వరికీ తెలియకుండా మానేజ్ చేశారని టాక్. కాానీ నేటి ఉదయం నుంచి ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కృష్ణుడు అరెస్ట్ అయ్యారంటూ లెక్కలేనన్ని వార్తలు వస్తున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kQOrKV
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...