Saturday, 4 September 2021

అందరూ కలిసి తింటారు, మందు కొడతారేమో.. నరేష్ ప్రైవేట్ మీటింగ్‌పై ప్రకాష్ రాజ్ కామెంట్స్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు మంచి రసవత్తరంగా మారనున్నాయి. ఇది వరకే తన ప్యానల్ అంటూ కొంత మందిని మీడియా ముందుకు తీసుకొచ్చారు. కానీ శుక్రవారం మాత్రం అధికారికంగా ప్రకటించేశారు. ఎవరెవరిని మెంబర్లుగా తీసుకున్నారో.. ఎవరిని మెయిన్ ప్యానల్‌లోకి తీసుకున్నారో ప్రకటించారు. అందరి నిర్ణయంతోనే సభ్యులను ఎంచుకున్నామని, తాను అధ్యక్షుడిగా పోటీ చేయబోతోన్నానని ప్రకాష్ రాజ్ మీడియా ముందు ప్రకటించారు. అయితే ఈ క్రమంలో కొన్ని విషయాలపై ప్రకాష్ రాజ్ స్పందించారు. ఇకపై తమ ప్యానెల్ నుంచి అధికార ప్రతినిధులు ఉంటారని, వారే మీడియాతో మాట్లాడతారని ప్రకాష్ రాజ్ తెలిపారు. బండ్ల గణేష్, జయసుధ, సనా, బెనర్జీ వంటి వారి స్పోక్స్ పర్సన్లుగా ఉంటారని తెలిపారు. అయితే ప్రకాష్ రాజ్ నిన్న మీడియాతో మాట్లాడు.. ఏర్పాటు చేస్తున్న వీకెండ్ పార్టీలపై కామెంట్ చేశారు. నరేష్ కూడా తన ప్యానెల్‌ను సిద్దం చేస్తున్నారని, తన వర్గాన్ని కూడ బెట్టుకుంటున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈ వీకెండ్ నరేష్ తన వర్గానికి స్పెషల్ పార్టీ ఇవ్వబోతోన్నాడట. ఈ మేరకు ప్రకాష్ రాజ్‌ను ఆ పార్టీపై స్పందించమని మీడియా అడిగింది. ఆ విషయం.. వారి పర్సనల్.. ఎవరు ఎలాగైనా క్యాంపైన్ చేసుకోవచ్చు. బయట రాజకీయ పార్టీల్లా ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుకోలేం.. మేం అంతా ఆర్టిస్ట్‌లం. అలా సాయంత్రం కలుసుకుంటాం.. ఎవరు ఏ పార్టీ అయినా చేసుకోవచ్చు.. పిల్చుకోవచ్చు.. మాట్లాడుకోవచ్చు.. అలా సాయంత్రం అందరూ కూర్చుని మాట్లాడుకుంటారు.. వారి కలలను పంచుకుంటారు.. కలిసి తింటారు.. మందు కూడా తాగుతారేమో.. అంటూ ప్రకాష్ రాజ్ మాట్లాడారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Ylu6Wt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...