Saturday, 4 September 2021

Prabhas 25: డిఫరెంట్ టైటిల్‌తో రాబోతున్న రెబల్ స్టార్.. దాని కోసం దిల్ రాజు గట్టి ప్లాన్

‘బాహుబలి’ సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ రేంజ్ మారిపోయింది. ఈ సినిమాతో ఆయన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన ‘సాహో’ సినిమా కాస్త నిరాశపరిచినప్పటికీ.. కలెక్షన్లు మాత్రం బాగానే రాబట్టింది. ప్రస్తుతం ఆయన వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘రాధేశ్యామ్’ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్‌గా ఓ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. దీంతో పాటు రామామణ మహాగాధ ఆధారంగా రూపొందుతున్న ‘ఆదిపురుష్’ సినిమాలో కూడా ప్రభాస్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తుండగా.. కృతి సనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇకపోతే.. కన్నడ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరక్షన్‌లో సలార్‌ అనే సినిమా చేస్తున్నారు ప్రభాస్. ఇందులో హీరోయిన్‌గా శృతి హాసన్ చేయనుంది. దీంతో పాటు.. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కే’ అనే సినిమాలో ఆయన నటిస్తున్నారు. టైమ్ మెషిన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ ఫ్యాంటసీ సినిమాలో దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్‌లో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు అని టాక్ వినిపిస్తుంది. ఇక దీంతో పాటు ఆయన తన కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకమైన 25వ సినిమాని నిర్మాత దిల్ రాజుతో కలిసి చేస్తున్నారు. ఓ సెన్సేషనల్ దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారట. పీరియాడిక్ మైథాలజీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు ‘వృందావన్’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఛాంబర్‌లో ఈ టైటిల్‌ని రిజిస్టర్ చేయించారట. అది ప్రభాస్ సినిమా కోసమే అని టాక్. మొత్తానికి ప్రభాస్, దిల్‌ రాజు కాంబోలో వచ్చే సినిమాకు ‘వృందావన్’ అనే ఆసక్తికర టైటిల్ పెట్టడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WUD8Je
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...