Saturday, 4 September 2021

కౌన్ బ‌నేగాలో కోటి రూపాయ‌ల విన్న‌ర్ హిమానీ బుందేలాపై పి.వి.పి వ్యాఖ్య‌లు

అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న షో కౌన్ బనేగా కరోడ్ పతి. ఇప్పుడు 13వ సీజన్ విజయవంతంగా నడుస్తోంది. ఎప్ప‌టిలాగానే బిగ్ బి అమితాబ్ తన‌దైన శైలిలో షోను ర‌క్తి క‌ట్టిస్తున్నారు. అయితే ఈ షోలో రీసెంట్‌గా అనే మ‌హిళ కోటి రూపాయ‌ల‌ను గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే. ఆగ్రాకు చెందిన ఈమె కోటి రూపాయ‌లు గెల‌వ‌డం విశేష‌మే అయినా, దృష్టి లోపంతో బాధ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ ఆమె కోటి రూపాయ‌ల‌ను గెలుచుకోవ‌డం అనే అంశం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. హిమానీ బుందేలా కోటి రూపాయ‌లు గెలుచుకోవ‌డంతో ఆమెను అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌ముఖ నిర్మాత వై.ఎస్‌.ఆర్‌.సీ.పీ నాయ‌కుడు ప్ర‌సాద్ వి.పొట్లూరి హిమానీను ప్ర‌శంసిస్తూ త‌న ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేశారు.‘‘ కళ్ళు ఉన్నోళ్లు కనిపించింది చూస్తారు! దిమాగ్ ఉన్నోళ్లు దునియా మొత్తం చూస్తారు! ఆక్సిడెంట్ లో చూపు కోల్పోయిన హిమనీ, పిల్లలకు సింపుల్ వే లో లెక్కలు చెప్తూ.. నేడు కేబీసీలో కోటి రూపాయలు నెగ్గారు. అన్ని ఉన్న మనం ఇంకేంత కష్టపడాలి??’’ అంటూ పాజిటివ్ కోణంలో ఈ మెసేజ్ చేశారు. కేజీబీలో కోటి రూపాయ‌లు గెలుచుకున్న హిమానీ బుందేలా ఏడు కోట్ల రూపాయ‌ల ప్ర‌శ్న‌కు మాత్రం స‌మాధానం తెలియ‌క పోటీ నుంచి కోటి రూపాయ‌ల‌ను తీసుకుని త‌ప్పుకున్నారు. అయితే ఆమె ఆప్ష‌న‌ల్‌గా ఎంచుకున్న ఏడుకోట్ల రూపాయ‌ల ప్ర‌శ్న‌కు స‌మాధానం త‌ప్పు కావ‌డం గ‌మ‌నార్హం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3h4wGXv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...