Monday, 27 September 2021

Liger - Mike Tyson: విజ‌య్ దేవ‌ర‌కొండ ‘లైగర్’ నుంచి కేక పెట్టించే అప్ డేట్ .. ఫ్యాన్స్‌కు కిర్రాక్కే..!

- : తెలుగు సినిమా రోజు రోజుకీ త‌న రేంజ్‌ను పెంచుకుంటూ స‌రికొత్త పుంత‌లు తొక్కుతుంది. తెలుగులో రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమాలు మ‌రే భాష‌లోనూ రూపొందడం లేదంటే అతిశ‌యోక్తి కాదు. ఆ కోవ‌లో సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలోవిజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘లైగర్’. పూరి, కరణ్ జోహార్, ఛార్మి నిర్మిస్తోన్న ఈ చిత్రం ఇప్పుడు ముంబైలో చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఇండియ‌న్ సినిమాల్లో న‌టించ‌ని ప్రపంచ మాజీ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ తొలిసారి ఓ పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోన్న తెలుగు సినిమాలో న‌టించ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఓ వీడియోను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. బాక్సింగ్ రింగ్‌లో చ‌రిత్ర సృష్టించిన మైక్ టైస‌న్ గురించి తెలియ‌జేస్తూ వ‌దిలిన ఈ వీడియోలో చివ‌ర‌ల్లో ఓ సగం విజ‌య్ దేవ‌రకొండ ముఖం, మ‌రో స‌గం మైక్ టైస‌న్ ముఖం క‌నిపిస్తుంది. ఈ క్రేజీ అప్‌డేట్ రౌడీ హీరో ఫ్యాన్స్‌కు కిక్ ఇస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోంది. సినిమా కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న లుక్ మొత్తం పూర్తిగా మార్చుకుని స‌రికొత్త‌గా క‌నిపించ‌బోతున్నాడు. హీరోకు మాస్ ఇమేజ్‌ను పెంచేలా సినిమాలు తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తుండ‌టంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ షెడ్యూల్ పూర్త‌యిన త‌ర్వాత లైగ‌ర్ మూవీ రిలీజ్ డేట్‌పై చిత్ర యూనిట్ అధికారిక ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ue44Az
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...