Monday, 27 September 2021

కొండపొలం ట్రైలర్ : అడవిలో పోరాటం.. గొర్రెల కోసం వైష్ణవ్ తేజ్ సాహసం

ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్‌తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత రెండో సినిమాను కూడా సైలెంట్‌గా కానిచ్చేశాడు. క్రిష్ దర్శకత్వంలో రాబోతోన్న సినిమాతో మరోసారి హిట్ కొట్టేందుకు వైష్ణవ్ తేజ్ రెడీ అయ్యాడు. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన నటిస్తోంది. ఇప్పటికే వదిలిన పోస్టర్లు, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ పెంచే క్రమంలో ట్రైలర్‌ను వదిలారు. ఇప్పుడు నెట్టింట్లో అదరగొడుతోంది. ఉన్నత చదువులు చదివి, ఉద్యోగం కోసం సిటీకి వెళ్లిన కుర్రాడికి తన కుటుంబ నేపథ్యం అడ్డుపడుతుంది. గొర్రెలు కాసే కుటుంబం, చదువురాని తల్లిదండ్రులు అంటూ అవమానిస్తుంటారు. నల్లమల అడవిలో ట్రైనింగ్ తీసుకున్నాను అంటూ హీరో చెప్పే డైలాగ్, ఆ తరువాత కొండపొలంలో పోరాట సన్నివేశాలు అదిరిపోయాయి. పులి వేట, మానవ మృగాలతో పోరాటాన్ని వైష్ణవ్ తేజ్ ఎలా గెలిచాడు అన్నదే కొండపొలం కథ. ఇక ఈ కొండపొలంలో ఓబులమ్మగా రకుల్ అద్భుతంగా కనిపించింది. వైష్ణవ్ తేజ్, రకుల్ కెమిస్ట్రీ బాగానే కుదిరింది. ఎంఎం కీరవాణి నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. జ్ఞాన శేఖర్ అడవి అందాలను ఎంతో గొప్పగా చూపించాడు. ఇక ఈ సినిమాతో వైష్ణవ్‌కు మరో హిట్ పడేట్టు కనిపిస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ 8న థియేటర్లోకి రాబోతోంది. క్రిష్ ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్‌పై తెరకెక్కించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zHQsOZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...