Sunday, 26 September 2021

KGF Chapter2: ‘కె.జి.యఫ్ ఛాప్టర్ 2’ రిలీజ్ డేట్‌పై మరోసారి క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు

Yash- : క‌న్న‌డ స్టార్ హీరో య‌ష్, ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం ‘కె.జి.యఫ్ ఛాప్టర్ 2’ ఈ సినిమా గ‌త ఏడాదిలోనే విడుద‌ల కావాల్సింది. కానీ క‌రోనా కార‌ణంగా షూటింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్యక్ర‌మాలు వాయిదా ప‌డుతూ వ‌చ్చాయి. ఎట్ట‌కేల‌కు చిత్ర యూనిట్ షూటింగ్‌ను పూర్తి చేసేసింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్త‌య్యాయి. అయితే ఇది పాన్ ఇండియా సినిమా కావ‌డంతో దేశం యావ‌త్తు థియేట‌ర్స్ ఓపెన్ అయిన‌ప్పుడే సినిమాను విడుద‌ల చేద్దామ‌ని నిర్మాత‌లు వెయిట్ చేస్తూ వ‌చ్చారు. కోవిడ్ సెకండ్ వేవ్ త‌ర్వాత వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న ప్రపంచం యావ‌త్తు సినిమాను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇప్పుడు మ‌హారాష్ట్ర‌లోనూ థియేట‌ర్స్ ఓపెన్ అవుతున్నాయి. దీంతో పలు బాలీవుడ్ సినిమాలు త‌మ సినిమా రిలీజ్ డేట్స్‌ను అనౌన్స్ చేస్తూ వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో ‘కె.జి.యఫ్ ఛాప్టర్ 2’ రిలీజ్ డేట్ ఏమైనా మారుతుందేమోన‌ని ప్రేక్ష‌కాభిమానుల్లో ఆస‌క్తి క‌లిగింది. అయితే, చిత్ర యూనిట్ పోస్ట‌ర్ ద్వారా ఈ వార్త‌ల‌కు క్లారిటీ ఇచ్చింది. సినిమాను వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14నే విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించింది. కె.జి.య‌ఫ్ ఛాప్ట‌ర్ 1కు కొన‌సాగింపుగా వ‌స్తున్న ‘కె.జి.యఫ్ ఛాప్టర్ 2’ పై భారీ అంచ‌నాలున్నాయి. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది. క‌న్న‌డ సినిమా రేంజ్‌ను పాన్ ఇండియా రేంజ్‌కు తీసుకెళ్లిన సినిమా కె.జి.య‌ఫ్ ఇందులో ఛాప్ట‌ర్ 1 సాధించిన హిట్ త‌ర్వాత నిర్మాత‌లు అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగా భారీగా ఖ‌ర్చు పెట్టి బాలీవుడ్ స్టార్ సంయ్ ద‌త్‌, ర‌వీనాటాండ‌న్‌లతో పాటు ద‌క్షిణాది విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్‌ను కీల‌క పాత్ర‌ల్లో నటింప చేశారు. కొన్ని నెల‌ల ముందు విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌పై ఓ రికార్డ్‌ను సెట్ చేసింది. దీంతో సినిమాపై ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో అంద‌రికీ అర్థ‌మైంది. మ‌రి వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న రానున్న ‘కె.జి.యఫ్ ఛాప్టర్ 2’ వ‌సూళ్ల ప‌రంగా ఎలాంటి రికార్డుల‌ను క్రియేట్ చేస్తుందో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lYF6l0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...