Sunday, 26 September 2021

ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన షాహిద్ కపూర్.. హిందీ ‘జెర్సీ’ వచ్చేది ఎప్పుడంటే..

కరోనా కష్టకాలంలో బాలీవుడ్ తీవ్రంగా దెబ్బతిన్నది. మొదటి వేవ్‌లో థియేటర్లు మూతపడటం.. షూటింగ్‌లు ఆగిపోవడం ఇండస్ట్రీని కుదిపేసింది. అయితే లాక్‌డౌన్ ముగిసి మళ్లీ జనజీవనం యధావిధిగా మారిన తర్వాత కూడా బాలీవుడ్‌కి ఎలాంటి సత్ఫలితాలు రాలేదు. థియేటర్లు తెరుకున్న తర్వాత విడుదలైన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. ఈలోపే కరోనా సెకండ్ వేవ్ వచ్చిపడింది. మళ్లీ థియేటర్లు మూతపడ్డాయి. దీంతో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు అన్ని దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయాయి. అయితే ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో కాకుండా దాదాపు చాలా చోట్ల థియేటర్లు తెరుకున్నాయి. మళ్లీ సినిమాలు విడుదల చేసుందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నటుడు అభిమానులకు మంచి న్యూస్ అందింది. అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ పేరుతో బాలీవుడ్‌లో రీమేక్ చేసి సాలిడ్ హిట్ కొట్టాడు హీరో షాహిద్ కపూర్. ఇప్పుడు అదే ట్రెండ్‌ని కొనసాగిస్తూ.. తెలుగులో సూపర్‌హిట్ అయిన ‘’ సినిమాను అదే టైటిల్‌తో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాకు మాతృక దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరీనే దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయినప్పటికీ.. విడుదలకు మాత్రం కరోనా కారణంగా అడ్డంకులు ఏర్పడుతూనే ఉన్నాయి. కానీ లేటెస్ట్‌గా ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించింది చిత్ర యూనిట్. నూతన సంవత్సర కానుకగా ఈ సినిమాను డిసెంబర్ 31వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ విషయాన్ని షాహిద్ కపూర్ కూడా ట్వీట్ చేశారు. ఈ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని పేర్కొన్న ఆయన.. అందరితో కలిసి సినిమాను థియేటర్‌లో చూసేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. పంకజ్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. . అల్లు అరవింద్, సూర్య దేవర నాగ వంశీ, దిల్ రాజు, అమన్ గిల్‌లు ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్ మరియు సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZzZH7B
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...