Sunday, 26 September 2021

వాట్సప్ చాట్ బయటపెట్టేసింది!.. రష్మిక మందన్నా మామూల్ది కాదు

ఇప్పుడు ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. ఈ కరోనా వల్ల షెడ్యూల్స్ అన్నీ మారిపోయాయి. డేట్స్ అన్నీ కూడా క్లాష్ అవుతుంటాయి. దీని కోసం ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. అన్ని ప్రాజెక్ట్‌లకు డేట్లను అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే రష్మిక గత కొన్ని నెలలుగా ఇంటికే వెళ్లలేదని, లాక్డౌన్ వల్ల కొన్ని రోజులు హైద్రాబాద్‌లోనే ఇరుక్కుపోయాయని, షూటింగ్ వల్ల కూడా ఇంటికి వెళ్లక చాలా నెలలు అయ్యాయని రష్మిక చెప్పుకొచ్చింది. అయితే తాజాగా రష్మిక షూటింగ్‌లతో ఫుల్ బిజీగా ఉంది. శర్వానంద్ హీరోగా వస్తోన్న అనే సినిమా షూటింగ్‌లో రష్మిక ఉంది. షూటింగ్ గ్యాప్‌లో బోర్ కొడుతోందని నిన్న ఓ పోస్ట్ చేసింది. అందులో బుంగమూతి పెట్టుకుని అలా నీరసంగా కూర్చుందీ బ్యూటీ. అయితే తాజాగా రష్మిక తన వాట్సప్ చాట్‌ను బయటపెట్టేసింది. ఇందులో వాట్సప్ వాల్ పేపర్ బయటకు వచ్చేసింది. తనకు ఎంతో ఇష్టమైన పెట్‌ ఫోటోను పెట్టేసుకుంది. ఇక ఈ వాట్సప్ చాట్‌లో ఏముందో ఓ సారి చూద్దాం. హాయ్ అని అటు నుంచి మెసెజ్ వచ్చింది. హాయ్ బేబీ అంటూ రష్మిక నుంచి మెసెజ్ వెళ్లింది. నేను మమ్మీని అంటూ అటు నుంచి సందేశం వచ్చింది. నాకు తెలుసురా అంటూ రష్మిక రిప్లై ఇచ్చింది. ఇక ఈ చాట్ స్క్రీన్ షాట్‌ను ఇన్ స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. ‘ఇలాంటిది ఇంత వరకు ఎప్పుడూ కూడా జరగలేదు.. మా మమ్మి ఎంతో క్యూట్. నాకు ఎంతగానో నవ్వొచ్చింది. ఈ ప్రపంచానికి ఇది చూపించాలని అనుకున్నాను అంతే’ అంటూ చెప్పుకొచ్చింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3CR7lsm
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...