Friday, 24 September 2021

అప్పుడు ఆ సినిమాలా ఇప్పుడు ఇది.. ‘రిపబ్లిక్’పై బాలీవుడ్ డైరెక్టర్స్ కామెంట్స్

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం హాస్పిటల్‌లో ఉన్న సంగతి తెలిసిందే. బైక్ ప్రమాదంలో గాయపడిన హీరో.. ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అయితే మరో వైపు సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతోంది. ముందుగా నిర్ణయించిన తేదీకే సినిమా విడుదల చేయాలని చిత్రయూనిట్ ఫిక్స్ అయింది. అందుకే అక్టోబర్ 1న సినిమాను రిలీజ్ చేసేందుకు అంతా సిద్దం చేసింది. ఈ క్రమంలోనే ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. ఇక మేనల్లుడి కోసం మామలు సినిమాను ప్రమోట్ చేసేందుకు ముందుకు వచ్చారు. సాయి ధరమ్ తేజ్ అందుబాటులో లేనప్పిటకి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ వేడుకలకు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ప్రధాన అతిథిగా వస్తున్నారు అంటూ చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అందుకు సంబంధించి.. ఓ ప్రత్యేక టీజర్ కూడా విడుదల చేసింది. అయితే కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ మరియు డీకేను విశేషంగా ఆకట్టుకుంది. ఒకప్పుడు ప్రస్థానం సినిమా ఏ రేంజ్‌లో ఉందో ఇప్పుడు ఈ సినిమా కూడా అదే రేంజ్‌లో ఉంది అంటూ వాళ్లు ట్వీట్ చేశారు. ఈ సినిమా చూసేందుకు ఎదురుచూస్తున్నామని వాళ్లు పేర్కొన్నారు. దేవకట్టాకు ఈ సినిమాతో మంచి సక్సెస్ లభించాలి అంటూ వాళ్లు పేర్కొన్నారు. ఇక రీసెంట్‌గా విడుదల అయిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక రాజకీయాల ప్రధాన అంశంగా రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతిబాబు, రమ్యకృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. అక్టోబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ మంచి హిట్ అందుకోవాలని ఆయన అభిమానులు ప్రార్థన చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lWmWjz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...