Friday, 24 September 2021

సమంత విడాకులంటే నరికేస్తా.. డై హార్డ్ ఫ్యాన్ ఎమోషనల్! ఏకంగా వార్నింగ్ ఇచ్చేశాడు బాబోయ్..

స్టార్ స్టేటస్ రావడం వరకు ఎలా ఉన్నా ఒక్కసారి ఆ హోదా వచ్చాక సదరు హీరోహీరోయిన్లను ఫాలో అయ్యే వాళ్ళు లక్షల్లో ఉంటారు. అందులో కొందరైతే అంతులేని అభిమానం పెంచుకొని డై హార్డ్ ఫ్యాన్స్‌గా మారిపోతుంటారు. అలా సమంతకు బోలెడంత మంది అభిమానులున్నారు. మరోవైపు సమంత భర్త నాగ చైతన్యకు కొండంత అక్కినేని ఇమేజ్ ఉండనే ఉంది. ఇక ఈ ఇద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యాక ఇద్దరికీ ఫ్యాన్స్ బేస్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంతో గత కొన్ని రోజులుగా వైరల్ అవవుతున్న సమంత- నాగ చైతన్య విడాకుల వ్యవహారం అక్కినేని అభిమానులను ఎంతగానో హర్ట్ చేస్తోంది. తాజాగా ఈ రోజు (సెప్టెంబర్ 24) నాగ చైతన్య హీరోగా రూపొందిన 'లవ్ స్టోరీ' మూవీ రిలీజ్ కావడంతో థియేటర్ల వద్ద అక్కినేని ఫ్యాన్స్ పోటెత్తారు. ఇక థియేటర్ నుంచి బయకొచ్చిన ఆ అభిమానులను సినిమాపై అభిప్రాయం సేకరించేందుకు మీడియా, పలు యూ ట్యూబ్ చానల్స్ అక్కడికి చేరుకున్నాయి. అయితే 'లవ్ స్టోరీ' సినిమాపై తన ఫీలింగ్స్ బయటపెట్టిన ఓ డై హార్డ్ ఫ్యాన్.. సమంత డివోర్స్ ఇష్యూ అడగడంతో ఓ రేంజ్‌లో ఎమోషనల్ అయ్యాడు. లవ్ స్టోరీ సినిమా ఓ ఫీల్ గుడ్ మూవీ అని, ఈ సినిమా చూస్తూ మన బాధలన్నీ మర్చిపోవచ్చని ఆ అభిమాని చెబుతుండగా.. మరి సమంత విడాకులు? అని ఓ మీడియా పర్సన్ ప్రశ్న వేయడంతో ఒక్కసారిగా ఫైర్ అవుతూనే ఎమోషనల్ అయ్యాడు సదరు అభిమాని. ''అబ్బో.. అబ్బో.. సమంత విడాకులంటే నరికేస్తా.. ఇద్దరూ కలిసే ఉండాలి ప్లీజ్. మీ ఇద్దరూ కలిసి ఉంటే మీ ఇంటికొస్తా. మీ కోసం ఏదైనా చేస్తా ప్లీజ్'' అంటూ కంటతడి పెట్టుకున్నాడు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇతనైతే అన్నీ కక్కేసి బయటపడ్డాడు కానీ ఇలా ఎమోషనల్ ఫీలింగ్స్ పెట్టుకున్న అభిమానులు చాలామందే ఉండే ఉంటారు. కాబట్టి ఇకనైనా అక్కినేని ఫ్యామిలీ ఈ ఇష్యూపై క్లారిటీ ఇస్తే బెటర్ అనేది పలువురి వాదన.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39ApCxO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...