Friday, 24 September 2021

తెలుగు మీమ్ లేదు.. మేము లేము : శ్రీను వైట్లపై ప్రముఖ ఓటీటీ సంస్థ

ప్రస్తుతం సోషల్ మీడియాను ఏలేస్తోన్నవి మీమ్స్. మీమర్స్ తమ క్రియేటివిటికి పదునుపెట్టి ఎంతో పెద్ద విషయాన్ని, అర్థం కానీ సంగతులను సైతం షార్ట్ అండ్ స్వీట్,నవ్వు తెప్పించేలా అర్థమయ్యేలా చెబుతుంటారు. అలా మీమర్స్ వేసే మీమ్స్‌కు ఎంతో మంది ఫిదా అవుతుంటారు. మరీ ముఖ్యంగా మన తెలుగులో మీమర్స్ ఎక్కువగా బ్రహ్మానందంను వాడుతుంటారు. జిఫ్ ఫైల్, మీమ్స్‌కు బ్రహానందం పెట్టింది పేరు. అందులోనూ మరీ ముఖ్యంగా శ్రీనువైట్ల సినిమాలో పోషించిన పాత్రలు, ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్‌తోనే సగం మీమ్స్ నడుస్తున్నాయి. మరీ ముఖ్యంగా సినిమా, అందులోని పద్మ శ్రీ పాత్రకు సంబంధించిన సీన్స్, ఎక్స్ ప్రెషన్స్ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. వాటిని వాడకుండా మీమ్స్‌ను క్రియేట్ చేయలేరు. అలా తెలుగు ప్రేక్షకుల్లో అవి అంతగా నాటుకుపోయాయి. అయితే ఈ క్రమంలో నెట్ ఫ్లిక్స్ సౌత్ ట్విట్టర్ హ్యాండిల్ ఈ మధ్య నెట్టింట్లో పుల్ యాక్టివ్‌గా ఉంటోంది. టాలీవుడ్ సెలెబ్రిటీలకు నెట్ ఫ్లిక్స్ ఇండియా సౌత్ స్పెషల్ విషెస్‌ను అందిస్తూ ట్వీట్లు వేస్తోంది. ఈ క్రమంలో నేటి బర్త్ డే సందర్భంగా ఓ స్పెషల్ ట్వీట్ వేసింది. శ్రీను వైట్ల సర్.. మీ సినిమాలు లేకపోతే.. తెలుగు మీమ్ లేదు.. మేము లేము.. మీరే మా వేధాంతి.. మా సిద్దాంతి. విజ్ఞాన ప్రదర్శనలు ఆపి.. హ్యాపీ బర్త్ డేని లిటిల్ బిట్.. ఇంగ్లీష్‌లో మ్యానేజ్ చేస్తాం సర్ అని చెప్పుకొచ్చింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3o7EeNs
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...