Tuesday, 28 September 2021

నా భార్య మా పనోడితో అక్రమ సంబంధం పెట్టుకుంటే నీకెందుకు? పవన్ ఫ్యాన్స్‌పై పోసాని ఫైర్

అభిమానులు తనకి ఫోన్ చేసి బెదిరించడమే కాకుండా.. వరుసగా మెసేజ్‌లు పెట్టి వేధిస్తున్నారని మీడియాకి ఆ మెసేజ్‌లను చూపించారు కృష్ణ మురళి. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. అయితే పోసాని పవన్‌పై చేసిన వ్యాఖ్యలపై జనసైనికులు ఓ రేంజ్‌లో రియాక్ట్ అవుతూ పచ్చిబూతులతో పోసానిని ట్రోల్ చేస్తున్నారు. అయితే మంగళవారం నాడు హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించిన పోసాని పవన్ కళ్యాణ్‌పైన ఆయన అభిమానులపైన ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ‘నేను ప్రెస్ మీట్ పెట్టి మీ గురించి మాట్లాడానని.. మీరు పెంచుకుంటున్న స్పెషల్ ఫ్యాన్స్‌ని నా మీదికి వదిలారు పవన్ కళ్యాణ్. నిన్నటి నుంచి ఈ క్షణం వరకూ సెకన్ల గ్యాప్ లేకుండా వరుసగా ఫోన్లు వస్తున్నాయి. వాళ్ల బాధభరించలేక ఫోన్ ఆపేశా. మళ్లీ ఆన్ చేసినా మెసేజ్‌లు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. నన్ను అమ్మనా బూతులు తిడుతున్నారు. ఆ మెసేజ్‌లలో కొన్నింటికి మీడియాకి చూపిస్తా. వాటిని చూపించడానికి కూడా నాకు గ్యాప్ ఇవ్వడం లేదు. నన్ను పవన్ కళ్యాణ్ వాళ్ల మనిషి ఏమన్నాడంటే.. ‘అరేయ్ పోసాని నీ పెళ్లం మీ ఇంటి పనోడితో అక్రమ సంబంధం పెట్టుకుంది... పెట్టుకుందాం లేదా?? 2010లో నువ్ కూడా ఆరేడు లక్షలు పెట్టి ఓ అమ్మాయి ఏదో చేశావా లేదా?? దీనికి సమాధానం చెప్పరా?’ అని అడిగాడు. ఒకవేళ నా పెళ్లం అక్రమ సంబంధం పెట్టుకుందే అనుకో.. అది నాది కదా సమస్య. అది నా ఫ్యామిలీ సమస్య. నా పెళ్లం మంచింది కాకపోవచ్చు.. నేను కొజ్జాని కావచ్చు.. నా బిడ్డలు నాకు పుట్టకపోవచ్చు.. అయినా మీకు సంబంధం లేదు కదా.. అది నా పర్సనల్ విషయం కదా.. అది మీకెందుకు? గతంలో చిరంజీవి గారి గురించి ఆయన కూతురు గురించి కేశినేని నాని ప్రెస్ మీట్ పెట్టి దారుణంగా మాట్లాడుతుంటే.. చిరంజీవి గారు అప్పుడు టూర్‌లో ఉన్నారు. ఇవన్నీ చిరంజీవి గారికి తెలిసి వేన్‌లో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయనతో పాటు అప్పుడు ప్రస్తుత మంత్రి కన్నబాబు గారు కూడా ఉన్నారు. నాకు ఫోన్ చేసి.. అన్నయ్య ఏడుస్తున్నారు అన్నం కూడా తినడం లేదు అని బాధపడుతున్నారు అని చెప్పారు. వెంటనే చిరంజీవి ఫోన్ తీసుకుని రాజకీయాలకు నా పర్శనల్ లైఫ్‌కి ఏం సంబంధం అని ఏడ్చారు. నాకు నిజంగానే బాధ వేసింది. వెంటనే నేను చిరంజీవి గారి ఆఫీస్‌కి వెళ్లి.. నానికి కౌంటర్ ఇచ్చాను. నీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా అని మాట్లాడా.. ఆ ప్రెస్ మీట్ చూసిన తరువాత పోసాని నా గుండెల్లో ఉన్నారని చిరంజీవిగారు అన్నారు. అప్పుడు నాకు ఏం సంబంధం ఉందని మాట్లాడా?? మానవ సంబంధం ఉంది కాబట్టే ఆరోజు మాట్లాడా? చిరంజీవి గారు నాకు ఏమీ చేయలేదు కానీ.. రాజకీయాలకు ఇంట్లో ఆడవాళ్లకి ఏం సంబంధం అనే ఆరోజున స్పందించా.. ఆ రోజు మీ అన్నయ్య కూతుర్ని అన్ని మాటలు అంటే నువ్ ఎక్కడ దాక్కున్నావ్ పవన్ కళ్యాణ్.. ఆ విషయంలో నన్ను చంపేయడానికి ప్రయత్నించారు.. నేను ప్రైవేట్ సెక్యురిటీ పెట్టుకుని నా ప్రాణాలను కాపాడుకున్నా.. ఆ టైంలో పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు’ అంటూ ప్రశ్నించారు పోసాని కృష్ణ మురళి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39M5p84
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...