Tuesday, 28 September 2021

Pushpa: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌‌కి సడెన్ సర్‌ప్రైజ్.. 'పుష్ప' నుంచి బిగ్ అప్‌డేట్

స్టైలిష్ స్టార్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప'. దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రస్తుతం ఈ మూవీ తొలి భాగం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సుకుమార్- అల్లు అర్జున్ హ్యాట్రిక్ సినిమాగా రానుండటంతో 'పుష్ప'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు టీమ్ రిలీజ్ చేస్తున్న వరుస అప్‌డేట్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ నేపథ్యంలోనే మరో బిగ్ అప్‌డేట్ ఇవ్వనున్నట్లు పేర్కొంటూ అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. గిరిజన యువతిగా కనిపించనుందనే ఓ టాక్ ఉంది. రేపు (సెప్టెంబర్ 29) ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్‌ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో రష్మికను ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారనే దానిపై జనాల్లో క్యూరియాసిటీ నెలకొంది. ఇకపోతే ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ సీట్ ఎడ్జ్ ఎంటర్‌టైనర్ ఇవ్వనున్నారని తెలియడంతో సినిమాపై బన్నీ అభిమానుల్లో ఉన్న ఆతృత రెట్టింపయింది. చిత్రంలో నేషనల్ వైడ్ బెస్ట్ టాలెంటెడ్ నటుల్లో ఒకరైన ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నాడు. అల్లు అర్జున్ చెల్లెలిగా వర్ష బొల్లమ్మ అనే కుర్ర హీరోయిన్‌ని తీసుకున్నారని తెలుస్తోంది. అనసూయ రోల్ కీలకం కానుందట. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WnApsa
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...