Saturday, 25 September 2021

నాకు నచ్చిన అతి విలువైన, ముఖ్యమైన చిత్రమిదే!.. మురిసిపోతోన్న ఉపాసన

మెగాకోడలు సోషల్ మీడియాలో చేసే సందడి అందరికీ తెలిసిందే. ఉపాసనకు సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ వేరే లెవెల్. మెగా అభిమానులు అందరూ కూడా ఉపాసనను ఫాలో అవుతుంటారు. ఆమె చెప్పే అప్డేట్లు, రామ్ చరణ్, గురించి షేర్ చేసే ఫోటోల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అలాంటి ఉపాసన సోషల్ మీడియాలో నిత్యం బిజీగానే ఉంటుంది. అలాంటి ఉపాసన అపోలో బాధ్యతలు ఓ వైపు, మెగా ఫ్యామిలీ బాధ్యతలు మరో వైపు.. ఇక సోషల్ మీడియాలో సామాజిక సేవా కార్యక్రమాలు ఇంకో వైపు చేస్తూనే ఉంటారు. అలా ఉపాసన సోషల్ మీడియాలో మంచి ఆదరణను దక్కించుకుంది. మెగా కోడలిగా విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఇక సమయ సందర్భం వచ్చినప్పుడు ఉపాసన తన అత్తమామలు, భర్త మీదున్న ప్రేమను చాటుతుంటుంది. మెగా ఫ్యామిలీ మీదున్న విధేయతను చాటుతుంది. ఇక మెట్టినింటినికి ఉపాసన ఎంత ప్రాధాన్యం ఇస్తుంటుందో.. పుట్టినింటికి అంతే ప్రాధాన్యం ఇస్తుంటుంది. ఉపాసన తన తండ్రి, తల్లి గురించి ఎక్కువగా చెబుతుంది. కామినేని వంశం గురించి ఉపాసన షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. తనకు ఎంతో విలువైన, ఇష్టమైన పిక్ అంటూ తన అత్తమామలు, తల్లిదండ్రుల ఫోటోను షేర్ చేసింది. అందులో మెగాస్టార్ చిరంజీవి కూర్చుని ఉండగా.. మిగతా వారంతా కూడా నిల్చుని ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZvIz2R
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...