Saturday, 25 September 2021

లవ్ స్టోరీ రికార్డుల దెబ్బ.. అక్కడైతే ఏకంగా దుమ్ములేపేసింది.. కలెక్షన్ల వర్షం!

నాగ చైతన్య, లవ్ స్టోరీ ఎంతగా జనాధరణ పొందుతోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెకండ్ వేవ్ తరువాత ఇంతటి స్థాయిలో సక్సెస్ అయిన చిత్రం మరొక్కటి లేదు. ఇక ఓవర్సీస్‌లో అయితే వకీల్ సాబ్ తరువాత అంతటి ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. ఫస్ట్ డే కలెక్షన్లలో లవ్ స్టోరి మంచి రికార్డులను నెలకొల్పింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం, సాయి పల్లవి జోడికి ఉన్న క్రేజ్ దృష్ట్యా సినిమా మీద అంచనాలు ఆకాశన్నంటాయి. కొంత మంది అంచనాలకు తగ్గట్టుగా సినిమా లేదని విమర్శలు వస్తున్నాయి. కానీ జనాలు మాత్రం లవ్ స్టోరీ మీద ప్రేమను కురిపిస్తున్నారు. ఇక ఏరియా వారిగా లవ్ స్టోరీ మంచి వసూళ్లను సాధించినట్టు కనిపిస్తోంది. ఒక్క నైజాంలోనే దాదాపు మూడు కోట్లకు పైగా కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. సీడెడ్‌లో కోటికిపైగా, ఉత్తరాంధ్రలో 61 లక్షలు కొల్లగొట్టినట్టు సమాచారం. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన ప్రతీ చోటా లవ్ స్టోరీ మంచి వసూళ్లనే రాబట్టినట్టు తెలుస్తోంది. అలా మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మొదటి రోజు దాదాపు పది కోట్ల గ్రాస్, ఏడు కోట్ల షేర్ వచ్చినట్టు టాక్. ఇక ఓవర్సీస్‌లో అయితే ఏకంగా మొదటి రోజే హాఫ్ మిలియన్ మార్క్ చేరుకుంది. ఇక ఈ వీకెండ్‌లోనే మిలియన్ మార్క్ చేరేసి.. బ్రేక్ ఈవెన్‌లోకి వచ్చేట్టు కనిపిస్తోంది. మొత్తంగా లవ్ స్టోరీ దెబ్బకు సినీ ప్రేమికులు ఫిదా అయినట్టు తెలుస్తోంది. ఈ రేంజ్ వసూళ్లు సాధించడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఈ చిత్రం మొత్తంగా పదహారు కోట్ల గ్రాస్, దాదాపు పది కోట్ల షేర్ సాధించినట్టు తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kGC3hP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...