Saturday, 25 September 2021

నాగార్జున అంటే మామూలుగా ఉండదు మరి.. ‘బంగార్రాజు’లో ఐదుగురు హీరోయిన్లతో..?

అక్కినేని హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న '' సినిమాపై ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. గతంలో వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలో 'బంగార్రాజు' పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నాగ్. దీంతో ఈ పాత్ర పేరునే టైటిల్‌గా తీసుకొని కళ్యాణ్ కృష్ణ మరో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకొని.. విడుదల కావాల్సింది. కానీ, కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదాపడుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం పరిస్థితులు మామూలుగా మారిపోవడంతో.. ఈ సినిమా షూటింగ్ యధావిథిగా కొనసాగుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో ఒక పాటలో నాగార్జున ఐదుగురు హీరోయిన్లతో చిందులు వేయనున్నారట. ఇప్పటికే ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో కూడా సోగ్గాడే చిన్ని నాయన తరహాలో స్వర్గం సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. ఇందులో ఆయన ఐదుగురు హీరోయిన్లతో కలిసి రొమాన్స్ చేయనున్నారట. బిగ్ బాస్‌ షోతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న మెనాల్ గజ్జర్, మీనాక్షి చౌదరి కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో కృతి శెట్టి కూడా హీరోయిన్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ఐదుగురితో కలిసి నాగార్జునకు ఓ ప్రత్యేకమైన సాంగ్ ఉంటుంది అని టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో నాగార్జున తనయడు ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆయనకు జోడీగానే కృతి శెట్టి ఈ సినిమాలో చేస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3i6TFSi
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...