Monday, 27 September 2021

భీమ్లా నాయక్ రూమర్లకు చెక్.. యుద్ధానికి సిద్ధంకండి.. రంగంలోకి నిర్మాత

రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన మాటలు ఎంతటి వివాదానికి దారి తీశాయో అందరికీ తెలిసిందే. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కాస్తా రాజకీయ వేదిక అయిపోయిందని కొందరు కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ తరుపున మాట్లాడిన మాటలను కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇక ఫిల్మ్ ఛాంబర్ అయితే తమకు ఎలాంటి సంబంధం లేదని పవన్ కళ్యాణ్ మాటలను పట్టించుకోకండి ప్రభుత్వానికి లేఖను రాసింది. కానీ పవన్ కళ్యాణ్ మీద మాత్రం రకరకాల రూమర్లు వస్తున్నాయి. అందులో మరీ ముఖ్యంగా సినిమా ఓటీటీలోకి రాబోతోందంటూ గాలి వార్తలు రాసేస్తున్నారు కొందరు. వాటిని నిర్మాత వెంటనే ఖండించారు. భీమ్లా నాయక్ అప్డేట్ ఇచ్చేందుకు నిర్మాత రంగంలోకి దిగాడు. ముందు అనుకున్నట్టుగానే సంక్రాంతి బరిలోకి దిగబోతోన్నట్టు ప్రకటించాడు. ఓన్లీ ఇన్ థియేటర్స్ అంటూ రూమర్లకు చెక్ పెట్టేశారు. పవన్ కళ్యాణ్‌ చేసిన రాజకీయ కామెంట్లను పక్కన పెట్టేయండి కానీ ఆయన సినిమా పరిశ్రమ గురించి లేవనెత్తిన అంశాల గురించి పట్టించుకోండి అని నాని, కార్తీకేయ వంటి వారు ఏపీ ప్రభుత్వానికి రిక్వెస్ట్‌లు పెట్టారు. రిపబ్లిక్ ఈవెంట్ దెబ్బ పవన్ కళ్యాణ్ మీద గట్టిగానే పడ్డట్టు కనిపిస్తోంది. అందుకే ఇలా ఏకంగా భీమ్లా నాయక్ ఓటీటీలో రాబోతోందనే రూమర్లను పుట్టించారు. ప్రతిష్ట, స్వీయగౌరవానికై జరిగే యుద్దానికి సిద్దంకండి అంటూ జనవరి 12న రాబోతోన్నట్టు నిర్మాత ప్రకటించేశాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XVOFcw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...