Monday, 27 September 2021

అరుదైన గౌరవం దక్కించుకున్న సమంత.. ‘ఎంతో గర్వకారణం’ అంటూ ట్వీట్..

‘కుందనపు బొమ్మ’ అంటే.. అక్షరాల అలాగే కనిపించేలా అందంతో తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిలో నిలిచిపోయింది నటి . ‘ఏం మాయ చేశావే’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ భామ.. ఆ తర్వాత స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. తెలుగులోనే కాదు.. తమిళంలోనూ సినిమాలు చేసి.. అక్కడి ప్రేక్షకులను కూడా ఆమె మురిపించారు. ఇక తన తొలి సినిమా హీరో అక్కినేని నాగచైతన్యతో ప్రేమలోపడిన సమంత.. 2017లో అతన్ని వివాహం చేసుకున్నారు. అయితే గత కొంతకాలంగా వీరికి సంబంధించి కొన్ని వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. వీరిద్దరు విడిపోతున్నారు అంటూ.. త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారు అంటూ కొన్ని రోజులుగా సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత తన సోషల్‌మీడియా ఖాతాల్లో అక్కినేని అనే పదం తొలగించడం.. ఆ తర్వాత కూడా జరిగిన కొన్ని పరిణామాలు ఈ వార్తలకు మరింత ఊతమిచ్చాయి. అయితే ఇప్పటివరకూ చైతన్య నుంచి కానీ, సమంత నుంచి కానీ.. ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే వీరిద్దరిపై రూమర్లు మాత్రం ఆగలేదు. అయితే తాజాగా సమంతకు అరుదైన గౌరవం దక్కింది. ఫాబ్ 40లో తాజాగా సమంతకు చోటు దక్కింది. ‘నాలుగు ఫిలిమ్‌ఫేర్ అవార్డులు, రెండు నంది అవార్డులు, నాలుగు సౌత్ ఇండియా ఇంటర్‌సేషనల్ మూవీ అవార్డులు, 3 సిని‘మా’ అవార్డులు గెలుచుకున్న 2021కి ఎంతో ప్రభావం చూపించే మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది’ అంటూ ఫెమినా పేర్కొంది. దీనిపై సమంత కూడా స్పందించింది. ఇది తనకు ఎంతో గర్వకారణం, ధన్యవాదాలు అని శామ్ రీట్వీట్ చేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ocvci7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...