Saturday, 25 September 2021

ఇకపై మమ్మల్ని ఆపలేరు.. మేం వస్తున్నాం : అక్షయ్ కుమార్

బాలీవుడ్ ప్రస్తుతం వెలవెలబోతోంది. కరోనరా దెబ్బకు థియేటర్లు మూత పడి ఘోరంగా నష్టాలను చవిచూస్తోంది. మన టాలీవుడ్ కాస్త తేరుకుని పరుగులుపెడుతోంది. ఫస్ట్ లాక్డౌన్ అనంతరం కూడా మంచి హిట్లు పడ్డాయి. సెకండ్ లాక్డౌన్ అనంతరం కూడా థియేటర్లు ఓపెన్ అయి సినిమాలు బాగానే నడుస్తున్నాయి. ఈ మధ్యే కోలీవుడ్‌లోనూ పరిస్థితి కాస్త మెరుగుపడింది. కానీ బాలీవుడ్‌లో మాత్రం ఇంకా థియేటర్లను ఓపెన్ చేయలేదు. ఈ క్రమంలో బాలీవుడ్ పెద్దలు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేను కలిశారు. తమ బాధలను వెల్లగక్కారు. ఇక మహా సర్కార్ బాలీవుడ్‌ను కనికరించింది. అక్టోబర్ 22 తరువాత థియేటర్లు ప్రారంభం చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటనను చేసింది. దీంతో దీపావళి, క్రిస్మస్ సందర్భంగా కొన్ని చిత్రాలు రెడీ అవుతున్నాయి. ఇందులో భాగంగా ముందుగా రాబోతోన్నట్టు కనిపిస్తోంది. అసలే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల కోసం ఎప్పటి నుంచి ఎదురుచూస్తోంది చిత్రం. పోలీస్ ఆఫీసర్, యాక్షన్ చిత్రాలకు ఎంతగా ఫేమస్సో అందరికీ తెలిసిందే. ఇక రోహిత్ శెట్టి దర్శకత్వంలో అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, రణ్ వీర్ సింగ్, కత్రినా కైఫ్ వంటి భారీ తారాగణంతో హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రం సూర్యవంశీ గురించి తాజాగా ప్రకటన వచ్చింది. ఈ దీపావళికి థియేటర్లో రాబోతోన్నట్టు.. ఈ సారి మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు అంటూ అక్షయ్ కుమార్ చెప్పుకొచ్చాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ubayQw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...