Saturday, 25 September 2021

గొడ్డలి పట్టిన వైష్ణవ్ తేజ్.. ‘కొండ పొలం’ నుంచి మరో ఆసక్తికర అప్‌డేట్

‘’ అనే నవల ఆధారంగా టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘కొండ పొలం’. ఇటీవలే ‘ఉప్పెన’ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బ్యూటిఫుల్ హీరోయిన్ సింగ్ ఆయనతో రొమాన్స్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఈ సినిమాలో రకుల్ క్యారెక్టర్ రివీల్ చేస్తూ ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్, వీడియో షేర్ చేశారు మేకర్స్. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది.. కానీ.. కరోనా వ్యాప్తి కారణంగా సినిమా విడుదల వాయిదాపడుతూ వస్తోంది. అడవి నేపథ్యంలో పూర్తి అడ్వెంచర్స్ చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో రకుల్ పూర్తి గ్రామీణ యువతిగా, గొర్రెలు కాచుకొనే అమ్మాయి పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో రకుల్ ‘ఓబులమ్మ’గా, ‘కటారు రవీంద్ర’ అనే పాత్రలో కనిపించనున్నారు. సినిమా కథకు సరిగ్గా సరిపోయాలా ఈ పాత్రలను రూపొందించారు దర్శకుడు క్రిష్. ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్‌కి విశేషమైన స్పందన వచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ లేటెస్ట్ అప్‌డేట్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీ గురించి ప్రకటన వచ్చింది. ‘కొండ పొలం’ సినిమా ట్రైలర్‌ను వచ్చే సోమవారం సాయంత్రం 3.33 గంటలకు విడుదల చేస్తామంటూ దర్శకుడు క్రిష్ పోస్ట్ చేశారు. ఓ అద్భుతమైన ప్రేమ కథను చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ క్రిష్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. ఇందులో వైష్ణవ్‌ ఓ గొడ్డలి పట్టుకొగా.. ఆ గొడ్డలిపై సినిమాలోని కొన్ని పాత్రలు కనిపించడం మనం గమనించవచ్చు.. ఇక అతని ముఖం కింద రకుల్ ప్రీత్.. ఇతర పాత్రలు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే.. ట్రైలర్ ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికి అర్థం అవుతోంది. ఇకపోతే.. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సాయి బాబు జాగర్లమూడి మరియు రాజీవ్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. ట్రైలర్‌తో పాటే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lRnya8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...