Saturday, 25 September 2021

మొత్తానికి పూరి కుమారుడికి దొరికిన బ్రేక్.. ‘రొమాంటిక్’ సినిమా విడుదల ఎప్పుడంటే..

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ఆయన సినిమా రిలీజ్ అయితే హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా చూస్తారు ఫ్యాన్స్. డైరెక్టర్‌ రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన పూరి జగన్నాథ్‌ తరువాత తనదైన స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇతర దర్శకుల సినిమాల కంటే పూరి సినిమాలు కాస్త విభిన్నంగా ఉంటాయి. ఆయన సినిమాల్లో చూపించే హీరోయిజం వేరే లెవెల్‌లో ఉంటుంది. అందుకే పూరి సినిమాలకు ఇండస్ట్రీలో ఉండే క్రేజ్ వేరు. అయితే తన కుమారుడు ఆకాష్‌ను ఇప్పటికే హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు పూరి. ఆయన చేసిన పలు సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన ఆకాష్.. మెహబూబా అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ స్వయంగా దర్శకత్వం వహించగా.. నేహా శెట్టి హీరోయిన్‌గా నటించింది. పాకిస్థానీ అమ్మాయికి.. ఇండియన్ అబ్బాయికి మధ్య జరిగే ప్రేమకథగా రూపొందిన ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా.. ఆకాష్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక ఆకాష్ రీసెంట్‌గా చేసిన సినిమా ‘’. ఈ సినిమాకు పూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా పూర్తై చాలాకాలమే అయినప్పటికీ.. కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. కొద్దిరోజుల క్రితం కూడా రొమాంటిక్ సినిమాను కనీసం ఓటీటీలో విడుదల చేయాలని పూరిని డిమాండ్ చేస్తూ.. అభిమానులు కామెంట్స్ పెట్టిన విషయం మనకు తెలిసిందే. కానీ, ఈ సినిమాను థియేటర్‌లోనే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. ప్రస్తుతం పరిస్థితులు మామూలుగా మారడంతో ఈ సినిమా విడుదలకు బ్రేక్ లభించింది. ఈ దీపావళి కానుకగా.. నవంబర్ 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అనిల్ పదురి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాతో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో సీనియర్ నటి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Wd4YRh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...