Saturday, 25 September 2021

టాలీవుడ్‌లో ఇలా జరగడం ఇదే తొలిసారి.. తన రికార్డు తానే బ్రేక్ చేసిన ‘గోండు బెబ్బులి’

ఇద్దరు స్టార్ హీరోలు.. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన అగ్ర దర్శకుడు.. ప్రతిష్ఠాత్మక బ్యానర్.. భారీ బడ్జెట్.. టాలీవుడ్‌లోనే ఇంతకు ముందెన్నడూ లేని పాజిటివ్ బజ్‌తో మాసివ్ మల్టీస్టారర్‌‌గా దర్శకధీరుడు జక్కన్న రూపొందిస్తున్న సినిమా ‘’. చరిత్రలో కలువని ఇద్దరు యోధులు.. అల్లూరి సీతరామ రాజు.. కొమురం భీమ్‌లు కలిసి పోరాటం చేస్తే ఎలా ఉంటుంది అనే అంశంతో ఈ సినిమా రూపొందింది. ఇందులో సీత రామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా నటిస్తున్నారు. అయితే కొన్ని ప్యాచ్ వర్క్‌లు తప్ప.. మిగితా సినిమా అంతా పూర్తి అయిందని ఇటీవలే చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో సినిమా దసరాకు విడుదల పక్కా అని అంతా భావించారు. కానీ, కొన్ని అనుకోని కారణాల వల్ల సినిమా విడుదల వచ్చే సంక్రాంతికి వాయిదాపడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే చిత్ర యూనిట్ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ పాత్ర ‘కొమురం భీమ్’ను పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అత్యంత వేగంగా ఒక మిలియన్ లైక్స్ సొంతం చేసుకున్న టీజర్‌గా ఇప్పటికే ఇది రికార్డు సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ టీజర్.. తన రికార్డును తానే బద్దలుకొట్టింది. అత్యంత వేగంగా 1.5 మిలియన్ లైక్స్ సాధించిన తొలి టీజర్‌గా ఈ ‘గోండు బెబ్బులి’ టీజర్ నిలిచింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా ఆలియా భట్ ఒలివియా మోరిస్‌లు నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవ్‌గన్, సముద్రఖని, శ్రియా సరణ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోకి అనువాదం కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3EUhMxa
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...