Friday, 24 September 2021

హ్యాపీ బర్త్‌ డే మమ్ములు.. నీ కోసమే ఇది.. విజయ్ దేవరకొండ పోస్ట్ వైరల్

తెలుగు తెరపై చాలా తక్కువకాలంలో స్టార్ స్టేటస్ పట్టేసిన .. కేవలం సినిమాలే కాకుండా ఇతర రంగాలపై కూడా ఫోకస్ పెడుతున్నారు. తన బిజినెస్ కార్యకలాపాలను విస్తారం చేస్తూ ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన AVD (ఏసియా విజయ్ దేవరకొండ) సినిమాస్ పేరుతో సర్వ హంగులతో మల్టీప్లెక్స్ థియేట‌ర్‌ నిర్మించి తన తల్లికి కానుకగా ఇచ్చారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో సకల సౌకర్యాలతో ఈ థియేటర్ నిర్మించిన విజయ్ దేవరకొండ.. నేడు (సెప్టెంబర్ 24) నాగ చైతన్య హీరోగా రూపొందిన 'లవ్ స్టోరీ' సినిమాతో గ్రాండ్‌గా ప్రారంభించారు. విజయ్ దేవరకొండ తల్లి మాధవి పుట్టిన రోజు సందర్భంగా ఈ థియేటర్ ఓపెన్ చేస్తూ ఆమెకు ఈ థియేటర్‌ని గిఫ్ట్‌గా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు థియేటర్‌ హాల్‌లో తల్లి మాధవి ఉన్న ఫొటోను ట్విట్టర్ వేదికగా పంచుకుంటూ.. ''హ్యాపీ బర్త్‌ డే మమ్ములు.. ఇది (AVD థియేటర్) నీ కోసమే.. మీరు మరింత ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. నేను ఇంకా కష్టపడి మీకు ఇలాంటి మరిన్ని మెమోరీస్ అందిస్తా'' అని తెలిపారు. ఈ ట్వీట్ చూసి విజయ్ దేవరకొండ తల్లికి ఆయన అభిమానులు బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు. విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'లైగర్' మూవీతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కారణంగానే ఈ థియేటర్ ఓపెనింగ్‌కి రాలేకపోయారు విజయ్ దేవరకొండ. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తోంది. చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zEFqKv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...