Friday, 24 September 2021

Pushpa: సెకండ్ సింగిల్‌పై లేటెస్ట్ అప్‌డేట్.. ఆ స్టార్ సింగర్‌‌తో పాడించిన దేవి శ్రీ ప్రసాద్..

అల్లు అర్జున్, కాంబినేషన్‌లో వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’. ఎర్ర చందనం బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ‘దాక్కో దాక్కో మేక’ అనే పాట విడుదల చేశారు మేకర్స్. విడుదలైన కొంత సమయంలోనే ఈ పాట సోషల్‌మీడియాలో వైరల్ అయింది. ఐదు భాషల్లో ఈ సాంగ్ రిలీజ్ చేశారు. తెలుగులో శివం, హిందీలో విశాల్‌ దడ్లాని, కన్నడంలో విజయ ప్రకాష్‌, తమిళంలో బెన్నీ దయాల్‌, మలయాళంలో రాహుల్‌ నంబియార్‌ పాటని ఆలపించారు. అయితే గతంలో విడుదలై ఈ సినిమా టీజర్లు, ఫస్ట్‌లుక్ పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన సినిమా టీజర్ ప్రేక్షకులను అమితంగా అలరించింది. అందులో ఉన్న బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. చివర్లో అల్లు అర్జున్ చెప్పిన ‘తగ్గేదే లే’ అనే డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. ఇక తాజాగా విడుదలైన తొలి సింగిల్ కూడా ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం అందిస్తోంది. కొంతకాలం విడుదల అయిన తొలి సింగిల్‌కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో అందరికి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి సెకెండ్ సింగిల్ గురించి వార్తలు సోషల్‌మీడియాలో వైరల్ అవున్నాయి. ఈ పాటని ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్‌తో సంగీత దర్శకుడు పాడించారు అని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో వీరిద్దరు కలిసి దిగిన ఫోటోలు పోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై కారిటీ రావాలి అంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3CN1SmJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...