Saturday, 4 September 2021

అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన సిద్ధార్థ్ శుక్లా కేసు.. దీనిపై డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ స్పందన

బాలీవుడ్‌లో ప్రముఖుల మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గత ఏడాది కాలంగా చాలామంది సెలబ్రిటీలు వివిధ కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో కొందరు అనారోగ్యంతో మృతి చెందగా.. మరికొందరు అనుమానస్పద స్థితిలో మరణిస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బుల్లితెర నటుడు, బిగ్‌బాస్ 13(హిందీ) విన్నర్ సిద్ధార్థ్ శుక్లా(40) కన్నుమూశారు. గురువారం ఆయన గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే మృతిపై పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక సిద్ధార్థ్ కుటుంబ సభ్యులు, బాలీవుడ్‌ టీవీ నటీనటుల ఆశ్రునివాళి మధ్య సిద్ధార్థ్‌ అంత్యక్రియలు ముగిశాయి. అంతకు ముందే ఆయన మృతదేహానికి పరీక్షలు నిర్వహించారు వైద్యులు. ఆయన శరీరంపై ఎలాంటి గాయాలు లేవని.. ఇది గుండెపోటు కారణంగా జరిగిన మరణమే అని వాళ్లు దాదాపుగా నిర్ధారించారు. ఇప్పటికే సిద్ధార్థ్ మృతిపై భారతదేశంలోని దాదాపు అన్ని ఇండస్ట్రీల నుంచి నటీనటులు సంతాపం తెలియజేశారు. బాలీవుడ్ నుంచి కూడా పలువురు అతనికి సంతాపం తెలిపారు. అయితే ఇప్పుడు ఈ కేసు అంతర్జాతీయ స్థాయికి చేరింది. అవును మీరు చదివింది నిజమే. సిద్ధార్థ్ శుక్లా మృతిపై ఓ అంతర్జాతీయ స్టార్ స్పందించారు. ఆయన మరెవరో కాదు.. ‘జాన్ సెనా’. డబ్ల్యూడబ్ల్యూఈ వంటి రెజ్లింగ్ టోర్నమెంట్‌లో పాల్గొంటూనే.. పలు హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించాను జాన్. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఎంతో క్రేజ్ ఉంది. ముఖ్యంగా భారతదేశంలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు సిద్ధార్థ్ శుక్లా మృతిపై స్పందించడం.. ఆసక్తికరంగా మారింది. అయితే కేవలం సిద్ధార్థ్ ఫోటోని మాత్రమే ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. మరి జాన్ సెనా పోస్ట్ వెనుకగల ఆంతర్యం ఏంటా అనే విషయంలో స్పష్టత లేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BM4XCZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...