Saturday, 4 September 2021

‘రొమాంటిక్’ యాంగిల్‌లో పూరి తనయుడు.. సినిమాకి సెన్సార్‌ రిపోర్ట్ కూడా అంతే మరి!

డాషింగ్ డైరెక్టర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ఆయన సినిమా రిలీజ్ అయితే హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా చూస్తారు ఫ్యాన్స్. డైరెక్టర్‌ రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన పూరి జగన్నాథ్‌ తరువాత తనదైన స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇతర దర్శకుల సినిమాల కంటే పూరి సినిమాలు కాస్త విభిన్నంగా ఉంటాయి. ఆయన సినిమాల్లో చూపించే హీరోయిజం వేరే లెవెల్‌లో ఉంటుంది. అందుకే పూరి సినిమాలకు ఇండస్ట్రీలో ఉండే క్రేజ్ వేరు. అయితే ఇప్పటివరకూ ఇండస్ట్రీల్లో ఉన్న స్టార్ హీరోలు అందరితో కలిసి పని చేసిన ఆయన.. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి ‘లైగర్’ అనే సినిమాలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ ఓ కిక్ బాక్సర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్‌ నుంచి స్టంట్ మాస్టర్లను కూడా పిలిపించారట. పూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక బాలీవుడ్‌లో కరణ్ జోహార్ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అయితే తన తనయుడు ఆకాష్ పూరిని ఎప్పుడో వెండితెరకు పరిచయం చేశారు పూరి. ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా అతను పలు సినిమాల్లో నటించాడు. ఇక హీరోగా అతను చేసిన ‘మెహబూబా’ అనే సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఆయన నటించిన ‘రొమాంటిక్’ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. రెండేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా కరోనా కారణంగా కొంచెం ఆలస్యమైన.. ఎలాగోలా షూటింగ్ పూర్తి చేశారు. ఈ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌కి పూరి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. పూరి శిష్యుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను థియేటర్‌లో విడుదల చేస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘యూ/ఏ’ సర్టిఫికేట్ ఇస్తున్నట్లు సెన్సార్ బోర్డు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఓ ‘రొమాంటిక్’ పోస్టర్‌ని కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమా ద్వారా హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుండగా.. మకరంద్ దేశ్‌పాండే, ఉత్తేజ్, సునయన కీలక పాత్రలో నటిస్తున్నారు. సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yOXr8d
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...