Saturday, 7 August 2021

Shaakuntalam సెట్‌లో బన్నీ ఫ్యామిలీ హల్చల్.. పిక్స్ వైరల్

సమంత, గుణ శేఖర్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా అల్లు ఫ్యామిలీకి ఎంతో ప్రత్యేకంగా నిలవబోతోంది.ఎందుకంటే ఆ చిత్రంతో అల్లు వారి నాల్గో తరం సినీ రంగ ప్రవేశం జరగబోతోంది. సినీ ఎంట్రీ శాకుంతలం సినిమాతో ఉండబోతోందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే అధికారిక ప్రకటన ఇచ్చేశారు. అర్హ సైతం సెట్ మీదకు వచ్చేసింది. ఆమె కోసం స్పెషల్ కేరవ్యాన్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అల్లు అర్హకు మేకప్ వేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ క్యారవ్యాన్‌లో బన్నీ ఫోటోలున్నాయి. ముఖ్యంగా పుష్ప లుక్‌కు సంబంధించిన స్టిల్ కనిపించింది. అలా అర్హ శాకుంతలం సెట్ మీద రచ్చ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఆమెకు అదిరిపోయే డైలాగ్‌లున్నాయని సమంత ఇది వరకే చెప్పేశారు. సమంత కొడుకు పాత్రలో అర్హ నటించబోతోంది. భరతుడి పాత్రలో అర్హ అదరగొట్టేయనుంది. అయితే తన కూతురు ఎలా నటిస్తుందో చూడాలని బన్నీ ముచ్చట పడ్డట్టు కనిపిస్తోంది. ఈ మేరకు ఫ్యామిలీతో సహా శాకుంతలం సెట్ మీదకు బన్నీ వచ్చేశారు. అల్లు స్నేహారెడ్డి,అయాన్ ఇలా ఫ్యామిలీని వెంటబెట్టుకుని బన్నీ వచ్చేశారు. బన్నీకి గుణ శేఖర్, నీలిమ గుణ సాదరంగా స్వాగతించారు. ఇక అర్హ నటనను బన్నీ దగ్గరుండి చూసి బాగానే ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37pnbNl
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...