Tuesday, 10 August 2021

Prakash Raj Surgery : ప్రకాష్ రాజ్‌కి ప్రమాదం.. సర్జరీ కోసం సిటీకి.. ఇంతకీ పరిస్థితి ఎలా ఉందంటే?

ప్రముఖ సినీ నటుడు జరిగింది. కింద పడిపోవడంతో దెబ్బలు తగిలినట్టు తెలుస్తోంది. అయితే ఆ గాయాలకు సర్జరీ చేయాల్సి రావడంతో వెంటనే హైద్రాబాద్‌కు తరలి వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు డాక్టర్ గురువారెడ్డి తనను బాగా చూసుకుంటున్నారని, ఆయన ఆధ్వర్యంలోనే ఈ సర్జరీ జరుగుతుందని చెప్పుకొచ్చారు. చిన్నగా ఫాక్చర్ అయిందని, ఖంగారు పడాల్సిన విషయం ఏమీ కాదని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఎవ్వరూ కూడా ఖంగారు పడాల్సిన అవసరం లేదని, తాను ఇప్పుడు క్షేమంగానే ఉన్నానని సమాచారాన్ని అందించారు. అయితే ఈ ప్రమాదం ఎక్కడ ఎలా జరిగిందనే విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు. షూటింగ్‌లో జరిగిందా? లేదా ఇంట్లో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందా? అన్నదానిపై ఎలాంటి స్పష్టత లేదు. కానీ తాను మాత్రం ఇప్పుడు క్షేమంగానే ఉన్నాను అనే సమాచారాన్ని అందించారు. దీంతో అభిమానులు అసలు ఏమైందా? అనే విషయాన్ని ఆరాతీస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3g7XDcz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...