Tuesday, 10 August 2021

Keerthy Suresh : Mahesh Babu అందంపై కీర్తి సురేష్ కామెంట్.. నమ్రత రిప్లై అదుర్స్

సూపర్ స్టార్ అందానికి ఫిదా కానీ హీరోయిన్ ఎవ్వరూ ఉండరు. అలా మహేష్ బాబు రోజురోజుకూ మరింత అందంగా తయారవ్వడంపై అందరూ షాక్ అవుతుంటారు. అందుకే పరుశురాం దీన్ని దృష్టిలో పెట్టుకుని, ఆయన అందానికి దిష్టి తగులుద్దేమో అని సర్కారు వారి పాటలో డైలాగ్ పెట్టేసినట్టు కనిపిస్తోంది. నిన్న మహేష్ బాబు బర్త్ డే సందర్బంగా వదిలిన సర్కారు వారి పాట టీజర్‌లో యాక్షన్ సీక్వెన్స్ అంతా ఒకెత్తు అయితే రొమాంటిక్ ట్రాక్ మరో లెవెల్‌లో ఉంది. మహేష్ బాబు కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయ్యేలా ఉంది. సర్కారు వారి పాట టీజర్‌లో హీరోయిన్ కీర్తి సురేష్ ఓ డైలాగ్ చెబుతుంది. సార్‌ ప్రతీ రోజూ పడుకునే ముందు దిష్టి తీయడం మరిచిపోకండి అని కీర్తి సురేష్ చెబుతుంటారు. అయితే ఇదే విషయాన్ని రియల్‌గా చెబుతూ నమత్రకు సలహాలు ఇచ్చారు. మేడమ్.. సార్ పడుకునే ముందు ప్రతీ రోజూ దిష్టి తీయండి అని చెబుతూ సినిమా పోస్టర్‌ను వదిలారు. అందులో మహేష్ బాబును కీర్తి సురేష్ అలానే చూస్తుండిపోయారు. అయితే కీర్తి వేసిన పోస్ట్‌కు నెటిజన్ల నుంచి వింత రియాక్షన్లు, కామెంట్లు వస్తున్నాయి. అయితే కీర్తి వేసిన పోస్ట్, చేసిన కామెంట్లపై నమ్రత స్పందించారు. ఆయనకు అలాంటివి తగలవన్నట్టుగా పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఏం చేయకుండానే పోతుందని నమత్ర నిన్న రిప్లై ఇచ్చారు. ఇక తాజాగా మరో సారి స్పందించారు. దిష్టి తీసేశాను అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి మహేష్ బాబు అందం మాత్రం నిజంగానే హాట్ టాపిక్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VKGb6F
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...