Tuesday, 10 August 2021

ఎక్కడికి వెళ్తే అక్కడే అలా.. ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఫోన్.. మంచు లక్ష్మీ హవా!!

మంచి భోజన ప్రియురాలన్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా మంచు లక్ష్మీకి దోశలు అంటే చాలా ఇష్టం. ఆమె తన ఇంట్లో రోజూ టిఫిన్‌లో దోశ కంపల్సరీ ఉంటుందట. రకరకాల దోశలను ప్రిపేర్ చేయిస్తారట. అయితే మంచు లక్ష్మీకి ఫుడ్ మీదున్న మక్కువతోనే ఆహాలో షో చేసేందుకు ముందుకు వచ్చినట్టున్నారు. అంటూ మంచు లక్ష్మీ ఇప్పుడు దూసుకుపోతోన్నారు. ఇప్పటికే మూడు ఎపిసోడ్‌లు సక్సెస్ ఫుల్‌గా పూర్తయ్యాయి. ఇందులో విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్, తరుణ్ భాస్కర్ వంటి వారు వచ్చారు. అయితే తరుణ్ భాస్కర్ ఎపిసోడ్‌లో మంచు లక్ష్మీ ఎన్నో విషయాలను పంచుకున్నారు. తామిద్దరికీ ఫుడ్ అంటే ఎంతో ఇష్టమని, అదే మమ్మల్ని ఇంత దగ్గరకు చేసిందని చెప్పుకొచ్చారు. ఇక పిట్ట కథలు సినిమా షూటింగ్‌లో జరిగిన ఇన్సిడెంట్‌ను కూడా మంచు లక్ష్మీ పంచుకున్నారు. ఓ సారి తాను ఎంతో ఇష్టంగా ఆర్డర్ చేసుకున్న ఫుడ్‌ను కూడా లేట్ అవుతోందని షూటింగ్‌లోనే వదిలేసి వచ్చానని మంచు లక్ష్మీ అన్నారు. అది మీరే తిన్నారు కదా? అని తరుణ్ భాస్కర్‌కు మంచు లక్ష్మీ గుర్తు చేశారు. అయితే తాను ఎక్కడికైనా వెళ్తే.. తెలియని చోటుకు, వేరే ఊరికి వెళ్తే.. అక్కడి ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఫోన్ చేస్తానని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చారు. చుట్టు పక్కల మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది? ఫేమస్ వంటకాలు ఏంటి? అని ఫోన్ చేసి మరీ తెలుసుకుంటారట. ఎంతైనా మంచు లక్ష్మీ రేంజ్ వేరు కదా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అలా మొత్తానికి తాను ఎక్కడికి వెళ్లినా అక్కడి వెరైటీ వంటకాలను రుచి చూస్తానని తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Ay55p5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...