Tuesday, 10 August 2021

Paagal Trailer: విశ్వక్ సేన్ లవర్స్ చిట్టా చూస్తే షాక్ కావాల్సిందే! ఐ లవ్ యూ చెప్పడం.. ఆ తర్వాత!!

యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా ''. నరేశ్ కుప్పిలి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విశ్వక్‌సేన్‌ జంటగా నటించింది. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన యూనిట్.. ఒక్కొక్కటిగా అప్‌డేట్స్ వదులుతూ సినిమాపై హైప్ పెంచేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేసి ఇదో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ అని ప్రేక్షకులకు తెలిసేలా చేశారు. 2 నిమిషాల 15 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్‌లో.. నా పేరు ప్రేమ్‌. నేను 1600 మంది అమ్మాయిల‌ను ప్రేమించాను అంటూ తన క్యారెక్టర్ గురించి చెబుతూ విశ్వక్ సేన్ రంగంలోకి దిగాడు. ఆయన చెప్పే లవర్స్ లిస్ట్ చూసి ఓ అబ్బాయి షాక్ కావడం ఈ వీడియోలో హైలైట్ అయింది. ‘నువ్వు ఏ అమ్మాయిని ప్రేమిస్తున్నావో, ఏ అమ్మాయిని ప్రేమించ‌ట్లేదో తెలియ‌క మేం అమ్మాయిల‌ను ఏడిపించ‌డమే మానేశాం’ అంటూ రాహుల్ రామ‌కృష్ణ చెప్పిన డైలాగ్ యూత్ ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతోంది. 'నువ్వు నేను క‌లిసుండ‌టం జ‌ర‌గ‌దు' అంటూ హీరోయిన్ నివేదా పేతురాజ్ ఎమోష‌న‌ల్‌గా చెప్పే డైలాగ్‌తో సినిమాలో ఎమోష‌న‌ల్ యాంగిల్ కూడా ఉందని చెప్పారు మేకర్స్. దిల్‌ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కం వేణుగోపాల్ ఈ సినిమాను నిర్మించారు. అర్జున్ రెడ్డి ఫేమ్ రాధన్ మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే విడుదలైన పాగల్ అప్‌డేట్స్ సినిమాపై ఆతృత పెంచేయగా, తాజాగా వదిలిన ట్రైలర్ మరింత ఆకట్టుకుంది. విశ్వక్ సేన్ లవర్ బాయ్ లుక్స్ సినిమా పట్ల అంచనాలు పెంచాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2X2SyeD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...