Saturday, 14 August 2021

Naga Babu : మై జాన్ అంటోన్న నిహారిక.. లేడీ డాన్ అంటూ సెట్‌లో నాగబాబు!

మెగా డాటర్ ప్రస్తుతం వెబ్ సిరీస్ షూటింగ్‌లతో బిజీగా ఉంటున్నారు. నిహారికతో పాటుగా కూడా సెట్‌లోకి అడుగుపెట్టారు. నాగబాబు, నిహారిక కలిసి ఇది వరకే కొన్ని వెబ్ సిరీస్‌ల్లో నటించారు. నాన్నకూచి అనే వెబ్ సిరీస్‌లో ఈ ఇద్దరూ కలిసి రచ్చ చేశారు. అయితే మళ్లీ ఇన్ని రోజులకు నాగబాబుతో కలిసి నిహారిక నటిస్తున్నారు. ఈ మేరకు నాగబాబు తన లుక్కును కూడా మార్చేసుకున్నారు. ఆ మధ్య ఓ కొత్త లుక్ తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. మొహం మీద గాటు, చేతిలో సిగరెట్‌తో నాగబాబు రచ్చ చేశారు. ఆ ఫోటో షూట్ కూడా నిహారిక చేద్దామని అనుకున్న వెబ్ సిరీస్ కోసమేనట. కానీ మధ్యలోనే ఆ ప్రాజెక్ట్ అటకెక్కడంతో ఆ లుక్ వృథా అయిపోయింది. అయితే తాజాగా నాగబాబు నిహారిక కలిసి షూటింగ్‌లో బిజీగా అయిపోయారు. సెట్‌లో కూర్చుని తీరిగ్గా ముచ్చట్లు పెడుతున్నట్టు కనిపిస్తోంది. వీరితో పాటు దర్శకుడు ప్రణీత్, గెటప్ శ్రీను కూడా ఉన్నారు. ఈ వెబ్ సిరీస్‌లో గెటప్ శ్రీనుకు అదిరిపోయే పాత్ర ఉందట. సెట్‌లో ఈ తండ్రీకూతుళ్ల రచ్చ మామూలుగా లేదు. మై జాన్ అంటూ నిహారిక తన తండ్రి గురించి చెబితే.. లేడీ డాన్ అంటూ నిహారిక గురించి నాగబాబు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తామిద్దరం వెబ్ సిరీస్ షూటింగ్‌లో బిజీగా ఉన్నామని తెలిపారు. ఈ మేరకు షేర్ చేసిన ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. గతవారం నిహారిక, చైతన్య ఇద్దరూ కూడా వార్తల్లో నిల్చిన సంగతి తెలిసిందే. అపార్ట్మెంట్ గొడవ కారణంగా హెడ్ లైన్‌లోకి ఎక్కేసింది ఈ మెగాజంట. చివరకు చైతన్య క్లారిటీ ఇవ్వడంతో వివాదాం కాస్తా సద్దుమణిగింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fZzhkY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...