Friday, 6 August 2021

Mohan Babu : మోహన్ బాబుతో మోహన్ లాల్.. లెజెండరీ డిన్నర్ అంటోన్న మంచు లక్ష్మీ

మోహన్ బాబుకు ఉన్న స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దక్షిణాదిలో విలక్షణ నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. కోలీవుడ్, మాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలోని వారితో సత్సంబంధాలున్నాయి. సూపర్ స్టార్ రజినీతో ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏక వచనంతో పిలిచేటంత మిత్రుత్వం వారిది. అలా పలు ఇండస్ట్రీలోని పెద్దలతో మంచి ర్యాపో మెయింటైన్ చేస్తుంటారు. తాజాగా మళయాలి సూపర్ స్టార్ మోహన్ లాల్‌తో తమకున్న అనుబంధాన్ని చూపించారు మంచు వారు. మంచు ఫ్యామిలీతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేసినట్టున్నారు. నిన్న రాత్రి డిన్నర్‌ను గ్రాండ్‌గానే ప్లాన్ చేసినట్టున్నారు. చూస్తూ ఉంటే షూటింగ్ నిమిత్తం హైద్రాబాద్‌కు వచ్చిన మోహన్ లాల్‌ను మంచు వారు సాదరంగా భోజనానికి ఆహ్వానించినట్టు కనిపిస్తోంది. అయితే ఇందులో సినీ చర్చలు ఏమైనా జరిగియా ఏమో తెలియడం లేదు గానీ అందరూ మాత్రం ఫుల్లుగా ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది. మంచు విష్ణు, మంచు లక్ష్మీ, మోహన్ బాబు, మోహన్ లాల్ ఇలా అందరూ కలిసి తెగ ముచ్చట్లు పెట్టుకుంటున్నట్టు కనిపిస్తోంది. మోహన్ లాల్, మోహన్ బాబు ఇలా ఇద్దరూ కలుసుకోవడంపై తన స్టైల్లో కౌంటర్లు వేశారు. లెజెండరీ డిన్నర్ అయిందని చెప్పేందుకు మోహన్ లాల్, మోహన్ బాబులోని Mలను వాడేశారు. మంచు లక్ష్మీ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య సూపర్ స్టార్ రజినీ మంచు ఫ్యామిలీ కలిసి ఉన్న ఫోటోలు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VrUvkk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...