Friday, 6 August 2021

చర్చి ఫాదర్‌‌గా మారిన నటుడు.. బ్రహ్మాజీ షాకింగ్ పిక్ వైరల్

తెలుగు పరిశ్రమలో విలక్షణ నటుడిగా, హాస్య ప్రధానమైన పాత్రల్లోనూ, విలన్‌గానూ మెప్పించారు బ్రహ్మాజీ. హీరోగానూ ప్రయత్నించారు. కానీ అంతగా సక్సెస్ అవ్వలేకపోయారు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బ్రహ్మాజీకి తెలుగు ప్రేక్షకుల్లో ఓ గుర్తింపు ఉంది. ఆయన పాత్రను వేస్తున్నారంటే జనాల్లో వచ్చే క్రేజ్ వేరు. మరీ ముఖ్యంగా ఈ మధ్య అయితే కామెడీ రోల్స్‌తో ఇరగ్గొట్టేస్తున్నారు. అదే సమయంలో ఎమోషనల్‌గా బరువైన పాత్రలతోనూ మెప్పిస్తున్నారు. అయితే తెరపై ఎలా ఉంటారో.. తెర వెనుక అంతకు మించి సరదాగా ఉంటారు. ఆయన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఆయన వేసే సెటైర్లు, నెటిజన్లకు ఇచ్చే కౌంటర్లు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. ఇక సినిమాల్లో ఎంత సరదాగా నవ్విస్తుంటారో.. సోషల్ మీడియాలో అంత కంటే ఎక్కువగా నవ్విస్తుంటారు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం ఇలా ప్లేస్ ఏదైనా కూడా బ్రహ్మాజీ నవ్వులు పూయిస్తుంటారు. ఇటీవలె తిమ్మరుసు సినిమాలో కనిపించి తన స్టైల్లో నవ్వించారు బ్రహ్మాజీ. తాజాగా బ్రహ్మాజీ ఓ ఫోటోను షేర్ చేశారు. ఇందులో బ్రహ్మాజీ తన వేషాన్ని మార్చుకున్నారు. ఇందులో చర్చ్ ఫాదర్‌గా కనిపిస్తున్నారు. అయితే ఇది ఏదైనా సినిమా కోసమై ఉంటుందని అంతా చర్చించుకుంటున్నారు. కానీ మొత్తానికి ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇలా బ్రహ్మాజీ ఇప్పుడు వేసిన ఈ ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Cmdvl1
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...