Friday, 6 August 2021

మరో పోర్న్ రాకెట్.. ఈ సారి బాలీవుడ్ నిర్మాత గుట్టురట్టు

బాలీవుడ్‌లో ప్రస్తుతం పోర్నోగ్రాఫీ వివాదం రోజురోజుకీ ముదిరిపోతుంది. కొన్ని రోజుల క్రితం ప్రముఖ సినీ నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా ఈ పోర్నోగ్రాఫీ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసుని ముంబై పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. శిల్పాశెట్టితో సహా.. ఈ విషయానికి సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరిని విచారణ చేశారు. అంతేకాదు.. ఎవరి మీదైనా అనుమానం వస్తే చాలు వాళ్లని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విషయంలో పలువురు హీరోయిన్లు కూడా రాజ్ కుంద్రాపై ఫిర్యాదులు చేశారు. అయితే ఈ కేసు విషయం ఎటూ తేలక ముందే.. బాలీవుడ్‌లో మరో పోర్న్ రాకెట్ బయటపడింది. అశ్లీల చిత్రాలను నిర్మించడంతో పాటు.. మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారంటూ.. నిర్మాత విభు అగర్వాల్‌పై కేసు నమోదు అయింది. 2013లో బాత్‌ బాన్‌ గయూని అనే సినిమాను నిర్మించారు . ఆ తర్వాత 2019లో ఆయన ‘ఉల్లు’ అనే యాప్‌ని ప్రారంభించారు. ఇందులో పూర్తిగా అశ్లీల కంటెంట్‌తో హిందీ, ఇంగ్లీష్‌, భోజ్‌పురి, తెలుగు, మరాఠీ సహా వివిధ భాషల్లో సినిమాలు వెబ్‌సిరీస్‌లు రూపొందించారు. అయితే ఈ యాప్ నిర్వాహణ నేపథ్యంలో ఆయన పలువురు మహిళలను వేధించారని కూడా సమాచారం. అంతేకాక.. ఉల్లూ ఆఫీస్‌లోని స్టోర్‌ రూమ్‌లో 28 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగినట్లు తమ వద్ద సమాచారం ఉందని ముంబై పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో విభూ అగర్వాల్‌, కంపెనీ హెడ్‌ అంజలీ రైనాలపై అంబోలి పోలిస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. వీరిపై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశామని ముంబై పోలీసులు తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VuWQuC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...