కొందరు ఎంతోకాలం కష్టపడి సెలబ్రిటీ హోదాలు సంపాదించుకుంటే కొందరు మాత్రం కొంతకాలంలోనే ఆ స్టేటస్‌ని సాధిస్తారు. అది వెండితెర మీద కావొచ్చు లేదా రీసెంట్‌గా అందుబాటులోకి వచ్చిన సోషల్‌మీడియా ద్వారా అయినా కావొచ్చు.. కొంతకాలంలోనే ఫేమస్ అవుతారు కొందరు. అలా సోషల్‌మీడియా ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది నటి కుమార్తె, సుప్రిత. తల్లి కంటే ఎక్కువగా ఫేమస్ అయింది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇక వెండితెరపై సురేఖా వాణి తన నటనతో ఎంత హంగామా చేస్తారో.. సోషల్‌మీడియాలో సుప్రిత అంతే హంగామా చేస్తారు. తరచూ డ్యాన్స్ వీడియోలు, రీల్స్ చేసుకుంటూ ఆమె అభిమానులను అలరిస్తూ ఉంటారు. తన కూతురితో సమానంగా సురేఖా కూడా డ్యాన్స్ వీడియోలలో చిందులు వేస్తుంటారు. వీళ్లద్దరి అందం చూసి నెటిజన్లు ఫిదా అవుతుంటారు. అందుకే పోస్ట్ చేసిన కొంత సమయంలోనే ఈ వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా వీళ్లద్దరు కలిసి ఓ అందమైన లోకేషన్‌లో ఫోటో దిగారు. సరదాగా నవ్వులు చిందించుకుంటూ ఫోటోకి పోజ్ ఇచ్చారు. ‘కేవలం నవ్వులు మాత్రమే’ అంటూ సుప్రిత ఈ పిక్‌ని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఈ పిక్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఫోటోలు ఇద్దరు ఎంతో అందంగా ఉన్నారు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇద్దరిని చూస్తుంటే రెండు గులాబీ పువ్వులు పక్కపక్కనే ఉన్నట్లు ఉంది అంటూ కొందరు కామెంట్ చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3isyieU
v
No comments:
Post a Comment