Friday, 6 August 2021

#BRO : ఆ రిలేషన్‌పై సినిమా.. అవికా గోర్ నవీన్ చంద్రలతో ప్రయోగం!

అవికా గోర్, ఇద్దరూ ఇద్దరే. చాలా సెలెక్టెడ్‌గా సినిమాలను చేస్తుంటారు. కథలు, పాత్రలు నచ్చితేనే ప్రాజెక్ట్‌లకు ఓకే చెబుతుంటారు. ఈ మధ్య అయితే నవీన్ చంద్ర విలన్‌గా, సపోర్టివ్ రోల్స్‌లోనూ మెప్పిస్తున్నారు. ఇక చాలా రోజులకు మళ్లీ తెలుగులో మెరిసేందుకు రెడీ అవుతున్నారు. చివరగా అవికా గోర్ రాజు గారి గది 3 సినిమాలో కనిపించారు. ఇక నవీన్ చంద్ర అయితే అర్ద శతాబ్దం అంటూ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. తాజాగా ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. సహజంగానే ఈ ఇద్దరూ అంటే హీరో హీరోయిన్లుగా నటిస్తుంటారని అంతా ఊహించి ఉండొచ్చు. కానీ ఈ ఇద్దరూ హీరో హీరోయిన్లుగా కాకుండా అన్నాచెల్లెళ్లుగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ అండ్ ఫస్ట్ లుక్‌ బయటకు వచ్చింది. నేషనల్ క్రష్ అయిన రష్మిక మందన్నా చేతుల మీదుగా ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేయించారు మేకర్స్. రాఖీ పండుగ త్వరలోనే రానుంది కాబట్టి.. ఈ మూవీని మీ ముందుకు తీసుకురాబోతోన్నామని చెప్పుకొచ్చారు. టైటిల్‌ పోస్టర్‌ను రిలీజ్ చేసినందుకు రష్మిక మందన్నాకు అవికా గోర్ థ్యాంక్స్ చెప్పారు. కార్తీక్ తురుపాని దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీని రవిచంద్ నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మొత్తానికి ఈ ఇద్దరూ అన్నాచెల్లెళ్లుగా ఏ మేరకు మెప్పిస్తారో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lDLyiQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...