నందమూరి నట వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చిన యంగ్ టైగర్.. అనతికాలంలోనే స్టార్ స్టేటస్ పట్టేసి ఫాలోయింగ్ పెంచుకున్నారు. తనదైన నటన, డాన్సులతో అభిమానులను ఫిదా చేస్తూ టాప్ హీరోల్లో ఒకరిగా సత్తా చాటుతున్నారు. వ్యక్తిత్వం పరంగా కూడా ఎన్టీఆర్‌లో ఓ మంచి మనిషి దాగి ఉన్నారని చాలామంది నటీనటులు చెబుతుంటారు. అందుకే కేవలం సాధారణ ప్రజలే కాకుండా పలువురు సెలబ్రిటీలు సైతం ఎన్టీఆర్‌ని బాగా ఇష్టపడుతుంటారు. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతుంటారు. తెలుగు నటీనటులతో పాటు ముఖ్యంగా తమిళ సినీ పరిశ్రమకు చెందిన ఎంతోమంది ఎన్టీఆర్ అన్నా, ఎన్టీఆర్ నటన అన్నా బాగా లైక్ చేస్తుంటారు. తాజాగా జరిగిన ఓ ప్రోగ్రాంలో నటి తన అభిమాన హీరో ఎవరనే విషయాన్ని బయటపెడుతూ ఎన్టీఆర్ పేరు చెప్పేసింది. అప్పట్లో తాను నాగార్జునను చాలా ఇష్టపడేదాన్ని కానీ.. ఇప్పుడు మాత్రం జూనియర్ ఎన్టీఆర్‌కు బిగ్గెస్ట్ ఫ్యాన్ అయిపోయానంటూ ఓపెన్ అయింది. అంతేకాదు అతనితో ఒక్క షాట్ లోనైనా నటించాలని ఉందని, తాను కన్న కలల్లో ఇది కూడా ఒకటుందని చెప్పుకొచ్చింది. కోలీవుడ్ యాక్టర్ విజయ్ కుమార్ డాటర్‌గా ఫేమస్ అయిన వనితా విజయ్ కుమార్.. తెలుగులో 'దేవి' సినిమాలో నటించింది. ఆ తర్వాత మరే తెలుగు సినిమాలోనూ కనిపించలేదు. కాకపోతే మంచి అవకాశం వస్తే ఇప్పుడు నటిస్తానని అంటోంది. ఇకపోతే వనితలో మరో యాంగిల్ నిత్యం పలు వివాదాలతో వార్తల్లో నిలుస్తుండటం. 14 ఏళ్ల వయసులోనే తనకు బన్నీ లైన్ వేశాడంటూ ఆశ్చర్య పర్చిన ఆమె.. అతను సూపర్ డాన్సర్ అని, ఛాన్స్ దొరికితే ఆయనతో కలిసి నటిస్తానని గతంలోనే మనసులో మాట చెప్పింది. ఈ లెక్కన చూస్తే టాలీవుడ్ కుర్ర హీరోలపై వనిత కన్ను పడిందని, వాళ్ళ సినిమాల్లో ఛాన్స్ వస్తే రెడీగా ఉందని అర్థమవుతోంది కదూ!
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lUyBkL
v
No comments:
Post a Comment