Thursday, 12 August 2021

Sukumar : మహేష్ బాబును కలిసి సుకుమార్.. ఆ ఇద్దరి మధ్య గ్యాప్ తగ్గిందా?

Mahesh Babu-Sukumar మధ్య గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. రంగస్థలం సినిమాతో మంచి ఊపు మీదున్న సుకుమార్.. ఆ తరువాత మహేష్ బాబుతో ఓ సినిమా చేసేందుకు ఉత్సాహాన్ని చూపించారు. సైతం సుకుమార్‌తో సినిమా చేయాలని బాగానే ప్రయత్నించారు. కానీ చెప్పిన కథ అంతగా మహేష్‌కు ఎక్కలేదని, అలా ఏదీ కూడా చెప్పకుండా తిప్పించుకున్నాడనే టాక్ వచ్చింది. అయితే మహేష్ బాబుతో సుకుమార్ ఇక పని కాదని అనుకున్నాడో ఏమో గానీ చాలా రోజులు వేరే ఇతర హీరోల కోసం ట్రై చేశాడు. అలా సుకుమార్ చివరకు బన్నీతో పుష్ప‌ను సెట్ చేశాడు. మరో వైపు మహేష్ బాబు మాత్రం తన తదుపరి సినిమా కోసం గట్టిగానే ప్రయత్నాలు చేశాడు. ఇక మహర్షి సినిమా ఈవెంట్లో వంశీ పైడిపల్లి గురించి చెబుతూ.. ఈ సినిమా కోసం ఎన్నో యేళ్లు ఎదురుచూశాడు. ఎంతో వెయిట్ చేశాడు.. కానీ కొందరు మాత్రం అలా ఆగరు అని కామెంట్లు చేశారు. ఆ వ్యాఖ్యలు సుకుమార్‌ను ఉద్దేశించే అన్నారని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. అలా మహేష్ బాబు, సుకుమార్ మధ్య దూరం పెరిగిందనే టాక్ వచ్చింది. ఇలానే పూరి జగన్నాథ్‌తోనూ మహేష్ సంబంధాలు అంత సరిగ్గా లేవని తెలుస్తోంది. ఇక వంశీ పైడిపల్లితోనూ మరో సినిమా ఉంటుందని చెప్పిన మహేష్ ఇంత వరకు దాని ఊసెత్తడం లేదు. అలా మహేష్ బాబుతో దర్శకులకు ఉన్న విబేధాలు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. అయితే తాజాగా సుకుమార్, మహేష్ బాబు కలిసి ఉన్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ యాడ్ షూటింగ్‌లో ఉన్న మహేష్ బాబు దగ్గరకి సుకుమార్ వెళ్లారట. ఈ ఇద్దరూ చాలా సేపు ముచ్చట్లు పెట్టేశారట. మొత్తానికి ఈ ఇద్దరి మధ్య గ్యాప్ తగ్గినట్టు కనిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fYOiDL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...