Thursday, 12 August 2021

తినే కంచంలో మలం.. మోహన్ బాబుకు ఘోర అవమానం.. కమెడియన్ ఆలీ ఎమోషనల్

ప్రతీ ఒక్కరి విజయం వెనుక కష్టాల కడలి ఉంటుంది. ఎన్నెన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొని ఉంటే గానీ ఆ స్థాయి విజయం రాదు. అలా సినీ ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారట. ఆయన ఎదుగుతున్న క్రమంలో మోహన్ బాబుకు ఎదురైన ఓ చేదు ఘటన గురించి తాజాగా చెప్పుకొచ్చారు. ఆర్టిస్ట్‌ల గొప్పదనం చెబుతూ కమెడియన్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట్లోవైరల్ అవుతున్నాయి. క్రమశిక్షణకు మారుపేరైన మోహన్ బాబుకు జరిగిన అవమానంపై అలీ చెప్పిన మాటలు అందరినీ కదిలిస్తున్నాయి. అలీ ఇప్పుడు బుల్లితెర,వెండితెర అంటూ ఫుల్ బిజీగా ఉన్నారు. కరోనా వల్ల వెండితెరకు సంబంధించిన షూటింగ్‌లు, ఆ పండుగ వాతావరణం ఎక్కువగా లేదు. కానీ బుల్లితెర మాత్రం దూసుకుపోతోంది. అలా అలీ ఇప్పుడు బుల్లితెరపై మంచి ఫాంలో ఉన్నారు. డ్రామా జూనియర్స్ అనే షోలో అలీ కూడా న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఆదివారం ప్రసారం కానున్న ఎపిసోడ్ ప్రోమో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రసారం కాబోతోన్న ఈ ఎపిసోడ్‌కు ముఖ్య అతిథిగా వచ్చారు. ఇక ఇందులో ఆర్టిస్ట్, స్టేజ్ ఆర్టిస్ట్‌లకు ఉన్న తేడాలు ఓ స్కిట్‌లో చూపించారు. స్టేజ్ ఆర్టిస్ట్‌లు ఈ కరోనా కష్టకాలంలో పడ్డా బాధలు చెబుతూ అందరినీ కంటతడి పెట్టించేశారు. అలా ఆర్టిస్ట్‌ల జీవితాలు ఎంత కఠినంగా, కష్టాల పాలవుతున్నాయో చూపించారు. ఆ ఎమోషనల్ సీన్‌ను చూసిన అలీ గతంలోని ఓ విషయాన్ని చెప్పుకొచ్చారు. మోహన్ బాబు గురించి చెబుతూ.. లక్ష్మీ తండ్రి, మంచు భక్తవత్సలం గారు ఆయన పేరు.. మూడు, నాలుగు నెలల నుంచి ఇంటి రెంట్ కట్టడం లేదని, వీడు ఖాళీ చేయడం లేదు.. అని ఆ ఓనర్.. తినే ప్లేట్‌లో మలాన్ని వేశాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jNrg3H
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...