Thursday, 12 August 2021

‘తలా’, ‘దళపతి’లు ఒకే ఫ్రేమ్‌లో.. ఇద్దరిని చూసి పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్‌

మన దేశంలో వినోదం విషయంలో ప్రేక్షకులు అత్యంత ఇష్టపడేది రెండే రెండు.. అవి సినిమా, క్రికెట్. సినిమా హీరోలపై అభిమానులు ఎంత ప్రేమ కరిపిస్తారో.. క్రికెటర్లను సినిమా హీరోలుగా భావిస్తూ అంతే అభిమానిస్తూ ఉంటారు. తమ అభిమాన సినిమా హీరోని కానీ, లేదా.. క్రికెటర్‌ని కానీ ఏమైనా అంటే అస్సలు ఊరుకోరు. చాలాసార్లు ఇలా అభిమానులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం.. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ పరిస్థితి కాస్త తగ్గింది. ఒక హీరోకి మరో హీరో సపోర్ట్ ఇవ్వడం. లేక.. ఒక క్రికెటర్‌కి మరో క్రికెటర్ తమ మధ్య ఉన్న బంధాన్ని తెలియజేయడంతో అభిమానులు కాస్త కూల్ అయ్యారు. ఇక టీం ఇండియాకు విజయవంతమైన కెప్టెన్‌లలో ముందుగా నిలుచునే కెప్టెన్ .. ఇక తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ముందు వరుసలో ఉండే హీరో . చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు తరఫున ఆడే ధోనీని.. తమిళ అభిమానులు ముద్దుగా తలా అని పిలుస్తారు. ఇక విజయ్‌ని ఎప్పటి నుంచో దళపతి అని పిలుస్తున్నారు. అయితే వీరిద్దరు కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే.. అది ఇక ఫ్యాన్స్‌కి పండుగే. అలాంటి పండుగ వాతావరణం ఫ్యాన్స్‌కి రానే వచ్చింది. ధోనీ, విజయ్ కలిసి తాజాగా ఓ సందర్భంగాలో దిగిన ఫోటో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. చెన్నైలోని గోకులం స్టూడియస్‌లో వీరిద్దరు కలుసుకున్నట్లు సమాచారం. చాలా సమయం వీరిద్దరు కలిసి గడినట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ధోనీ కెప్టెన్సీ వహిస్తున్న చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకి విజయ్, నయనతార బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ధోనీ, విజయ్ దిగిన ఫోటోని ధోనీ స్నేహితుడు సీమంత్ లోహానీ పోస్ట్ చేశారు. ‘దీనికి క్యాప్షన్ అవసరం లేదు. తలాతో దళపతి’ అంటూ పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VOHgdf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...