Saturday, 7 August 2021

Evaru Meelo Koteeswarulu : అదిరిపోయిన ప్రోమో.. ఆ మాటకు ఎన్టీఆర్ షాక్

యంగ్ టైగర్ బుల్లితెరపై క్రియేట్ చేసిన రికార్డులు అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షోను విజయవంతంగా రన్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అలాంటి ఎన్టీఆర్ ఇప్పుడు మళ్లీ బుల్లితెర ప్రేక్షకులను మెప్పించేందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ఎవరు మీలో కోటీశ్వరుడు అంటూ ముందుకు రాబోతోన్నారు. ఇది వరకే ఈ షోను చిరంజీవి, నాగార్జున వంటి వారు నడిపించారు. వారిద్దరూ స్టార్ మాలో ఈ షోను సక్సెస్ ఫుల్‌గా రన్ చేశారు. అయితే ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ జెమినీ చానెల్ కోసం అనే షోను చేసేందుకు వస్తున్నారు. ఇది కేవలం ఆట మాత్రమే కాదని చెప్పేందుకు వెరైటీ ప్రోమోలను విడుదల చేస్తున్నారు. ఇందులో ఆటతో పాటు వివిద రకాల మనుషులు, వారి జీవితాలను కూడా చూపించబోతోన్నామన్నట్టుగా ప్రోమోలను కట్ చేస్తున్నారు. తాజాగా వదిలిని ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది. చిన్నప్పుడు స్కూల్‌లో అందరినీ మీ లక్ష్యాలు ఏంటి? పెద్దయ్యాక ఏమవ్వాలని అనుకుంటున్నారు? అని టీచర్ అడుగుతుంటారు. అలా అందులోంచి ఓ విద్యార్థిని తాను అమ్మ కావాలని చెబుతుంది. అందరూ ఆశ్చర్యపోతారు. తాను వెళ్లిన ప్రతీ చోటా అదే సమాధానం చెబుతుంది. ఇక హాట్ సీట్ మీదు కూర్చున్న సమయంలోనూ అదే సమాధానం చెబుతుంది. అమ్మ కావాలని అనుకుంటున్నాను అని చెప్పడంతో ఎన్టీఆర్ షాక్ అవుతారు. దానికి ఆ అమ్మాయి అసలు విషయం చెబుతుంది. చిన్నతనంలో తన అమ్మ ఎంతో కష్టపడి తమను పెంచారని, ఓ కలెక్టర్ అయితే జిల్లాను, సీఎం అయితే రాష్ట్రాన్ని మాత్రమే ముందుకు తీసుకెళ్తాడు.. కానీ ఓ అమ్మ మాత్రమే భవిష్యత్ తరాన్ని ముందుకు నడిపించగలదు. అందుకే నేను అమ్మను కావాలని అనుకుంటున్నాను అని ఎన్టీఆర్‌కు వివరించారు. ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు.. కథ మీద కల మీద.. ఆట నాది కోటీ మీది.. అంటూ టచ్ చేసేశారు. ఈ షో ఆగస్ట్‌లో ప్రారంభం కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fERDb0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...