Friday, 27 August 2021

Doctor Babu: శ్రీముఖిపై చేయి చేసుకున్న అవినాష్.. కారణం కార్తీకదీపం!! కిర్రాక్ సీన్ వైరల్

సోషల్ మీడియాలో స్పూఫ్ వీడియోలు చేస్తూ పాపులారిటీ పెంచుకోవడం నేటితరం సెలబ్రిటీలకు ఓ అస్త్రంగా మారింది. డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్, కామెడీ సీన్స్ లాంటివి తీసుకొని స్పూఫ్ వీడియోలతో అట్రాక్ట్ చేస్తున్న సెలబ్రిటీల లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా పెద్దదే అవుతుంది. అయితే ఆ స్పూఫ్ వీడియోల్లోనూ ప్రత్యేకత చాటుకుంటూ , వంటలక్కలను ఇమిటేట్ చేశారు , . దీంతో ఈ వీడియో వైరల్ అయింది. బుల్లితెరపై నిత్యం సందడి చేసే వాళ్లలో శ్రీముఖి, అవినాష్ ముందు వరుసలో ఉంటారు. నిజ జీవితంలో మంచి స్నేహితులైన ఈ ఇద్దరూ సోషల్ మీడియాలోనూ అదే హవా కంటిన్యూ చేస్తుంటారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్, వీడియోలతో నెటిజన్ల దృష్టి తమపైనే పడేలా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ స్పూఫ్ వీడియో చేసిన శ్రీముఖి.. దాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ ''మధ్య తరగతి కుటుంబ బాధలు.. డాక్టర్ బాబు, .. మీరు కలవాలని కోరుకుంటున్నాం'' అని పేర్కొంది. ఈ వీడియోలో 'కార్తీకదీపం' డాక్టర్ బాబు, వంటలక్క పాత్రల్లో లీనమై కనిపించారు అవినాష్, శ్రీముఖి. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన కార్తీక్, దీప ట్రీట్మెంట్ సెంటిమెంట్ సీన్‌ని స్పూఫ్ వీడియో చేసి ఎమోషనల్‌గా కనిపించారు. ట్రీట్మెంట్ తీసుకోవా? అంటూ శ్రీముఖిపై చేయి చేసుకున్న అవినాష్, బ్యాక్ గ్రౌండ్‌లో కార్తీక దీపం డైలాగ్స్ నెటిజన్లు బాగా ఆకర్షించాయి. ఇది చూసి '' క్రేజ్ అంటే ఇది, వీళ్లిద్దరి పర్‌ఫార్‌మెన్స్ కిర్రాక్ అసలు'' అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mzaBnz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...