Monday, 16 August 2021

Cm Jagan: చిరంజీవికి నేరుగా ఫోన్ కాల్.. హుటాహుటిన మెగాస్టార్‌ ఇంట సినీ ప్రముఖుల మీట్

క‌రోనా తగ్గుముఖం ప‌ట్ట‌డంతో థియేట‌ర్లు తెరిచేందుకు ఎగ్జిబిట‌ర్లు సిద్ధ‌మైనా ఏపీలో టిక్కెట్టు ధ‌ర ఓ స‌మ‌స్యగా మారింది. స‌వ‌రించిన ధ‌ర‌ల‌తో ఎగ్జిబిష‌న్, పంపిణీ రంగాలు చిక్కుల్లో ప‌డ్డాయి. చాలాకాలంగా ఈ ఇష్యూ ఓ కొలిక్కి రావడంలేదు. దీంతో సీఎం జ‌గ‌న్‌తో భేటీ కోసం సినీపెద్ద‌లు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని క‌థ‌నాలు కూడా వచ్చాయి. ఈ పరిస్థితుల నడుమ తాజాగా నుంచి మెగాస్టార్‌కు పిలుపు రావడంతో సినీ వర్గాలు అలర్ట్ అయ్యాయి. ఆంధ్రప్ర‌దేశ్‌లో టిక్కెట్టు రేట్ల స‌మ‌స్య‌ల‌పై, అలాగే సినీ ప‌రిశ్ర‌మలో ఉన్న స‌మస్య‌ల‌పై చ‌ర్చించేందుకు చిరంజీవిని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. మంత్రి పేర్ని నాని నేరుగా చిరుకి ఫోన్ చేసి ఆహ్వానించారు. ఈ నెలాఖరులో సీఎం జగన్‌తో మీట్ కానున్నారని తెలుస్తోంది. దీంతో ఈ భేటీలో ఇండస్ట్రీ తరఫున సీఎంకి విన్న‌వించాల్సిన అన్ని విష‌యాల‌పై కూలంకుశంగా చ‌ర్చించి వెళ్లాల‌న్న ఉద్దేశంతో సినీ పెద్దలంతా మీట్ అయ్యారు. హైద‌రాబాద్ లోని మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఈ మీటింగ్ జ‌రిగింది. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫిలిం చాంబ‌ర్ అధ్య‌క్షులు నారాయ‌ణ దాస్, కింగ్ నాగార్జున, అల్లు అరవింద్, సురేష్ బాబు, ఆర్. నారాయణమూర్తి, దిల్ రాజు, కే.ఎస్ . రామారావు , దామోదర్ ప్రసాద్, ఏషియన్ సునీల్, స్రవంతి రవికిశోర్ , సి. కళ్యాణ్, ఎన్వి. ప్రసాద్, కొరటాల శివ, వి.వి.వినాయక్, జెమిని కిరణ్, సుప్రియ భోగవల్లి బాబీ యూవీ క్రియేషన్స్ విక్కీ - వంశీ, నిర్మాత‌ల సంఘం, ఎగ్జిబిష‌న్ రంగాల నుంచి ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు. ఇటీవ‌ల ఏపీలో వ‌చ్చిన జీవోలో ఉన్న‌ అంశాలపై చ‌ర్చించారు. సీఎంతో స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి మార్గాలేమిటి? అన్న‌దానిపై చర్చలు జరిపారు. అన్నిటికీ త్వరగా ప‌రిష్క‌రించాల‌న్న‌ది ప్ర‌ధాన డిమాండ్. చిన్న నిర్మాత‌ల స‌మ‌స్య‌ల‌పైనా సీఎంతో భేటీలో చ‌ర్చించ‌నున్నారు. ముఖ్యంగా ఈ భేటీలో టిక్కెట్టు రేట్ల‌పై చ‌ర్చించాలని డిసైడ్ అయ్యారు. గ్రామ పంచాయితీ, న‌గ‌ర పంచాయితీ, కార్పొరేష‌న్ ఏరియాల్లో టిక్కెట్టు ధ‌ర‌ల‌పై ఏం అడ‌గాలి? చిన్న సినిమాల మనుగడకోసం ఐదో షో విషయమై ఏం చేయాలి అనే విషయాలపై చర్చించుకోవడం జరిగింది. ఇండస్ట్రీలో నెలకొన్న అసంతృప్తిలపై సానుకూల వాతావరణం వచ్చేలా, అలాంటి సమస్యలన్నీ ఓ కొలిక్కి వచ్చేలా అందరూ కలిసి చర్చించుకోవడం జరిగింది. అలాగే పరిశ్రమలో అన్ని భాగాల్లో ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూలంకుషంగా చర్చించిన సినీ పెద్దలు.. ఈ సమస్యల పరిష్కారం కోసం మార్గాలు ఎలా వెతకాలనే దానిపై దృష్టి పెట్టారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3iR5JIk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...