Monday, 16 August 2021

‘గంధర్వ’ ఫస్ట్ లుక్ రిలీజ్.. ఆసక్తి రేకెత్తిస్తున్న మోషన్ మోషన్ పోస్టర్.. ఇదో యాక్షన్ థ్రిల్లర్!!

'వంగవీటి, 'జార్జిరెడ్డి' ఫేమ్ హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా ‘’. గాయత్రి ఆర్. సురేష్, శీత‌ల్ భ‌ట్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ఫ‌న్నీ ఫాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, వీర శంక‌ర్ సిల్వ‌ర్ స్క్రీన్స్ ప‌తాకాల‌పై అప్సర్ దర్శకత్వంలో ఎమ్.ఎన్ మధు ‘గంధర్వ’ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయి కుమార్, సురేష్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇండియ‌న్ సినిమాల్లో రాన‌టువంటి ఓ డిఫ‌రెంట్ క‌థాంశంతో ద‌ర్శ‌కుడు అప్స‌ర్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారట. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కు న‌టించ‌ని ఓ డిఫ‌రెంట్ రోల్‌లో సందీప్ మాధ‌వ్ క‌నిపించ‌నున్నారని చిత్రయూనిట్ చెబుతోంది. తాజాగా విడుదలైన ఫ‌స్ట్‌లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే హీరో సందీప్ మాధ‌వ్ రౌడీల‌ను చిత‌క్కొడుతున్నారు. హీరో చేతులు ఓ కుర్చీకి క‌ట్టేయ‌బ‌డి ఉన్నాయి. చూస్తుంటే ఇదో యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని తెలుస్తోంది. చిత్రంలో భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలుంటాయ‌ని స్పష్టమవుతోంది. గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తుది ద‌శ‌కు చేరుకుంది. నాగు.వై ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌‌గా పనిచేస్తుండగా.. ష‌కీల్ సంగీతం అందిస్తున్నారు. అతిత్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫినిష్ చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37LUbQ7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...