Monday, 16 August 2021

వారం మొత్తం అలా గడిచింది!.. సమంత రచ్చ మామూలుగా లేదు

గత వారం అంతా కూడా ఎంత బిజీగా ఉన్నారో అందరికీ తెలిసిందే. వారం అంతా కష్టపడితే.. చివర్లో వీకెండ్‌ను ఎంతలా ఎంజాయ్ చేయాలనిపిస్తుందో కదా. అయితే ఈ వారం మొత్తం మనం ఏం చేశామా? అని ఒక్కసారైనా తిరిగి చూసుకోవాలని అనిపిస్తుంది. అలానే సమంత కూడా తాను గత వారం అంతా కూడా ఏం చేశానా? అని ఒక్కసారి గుర్తుకు చేసుకున్నట్టున్నారు. తాజాగా ఆమె షేర్ చేసిన వరుస ఫోటోలను చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. మామూలుగా అయితే సమంత గత వారం అంతా కూడా సినిమాతోనే బిజీగా ఉన్నారు. మొత్తానికి ఆ మూవీ షూటింగ్‌ను సమంత పూర్తి చేసేశారు. ఇక చివరి రోజు గుణశేఖర్, ఆయన టీం కలిసి సమంతను ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సమంత బాగానే ఎమోషనల్ అయ్యారు. డైరెక్టర్‌ను ప్రేమగా హత్తుకుని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక సమంతలోని చిన్నపిల్ల బయటకు వచ్చినట్టు అయింది. అలా గత వారం ఎక్కువగా సినిమా షూటింగ్, ఆ టీం మెంబర్స్‌తోనే గడిపారు. ఈ మేరకు గుణ శేఖర్ సెట్‌లో ఉన్న ఫోటోను, తన ఫ్రెండ్ శిల్పా రెడ్డితో గడిపిన క్షణాలు, వీకెండ్ సందర్భంగా బయటి ఈవెంట్లకు వెళ్లిన ఫోటోలు, తన సాకీ బ్రాండ్ కోసం దిగిన ఫోటోలు, వాటికి సంబంధించిన చర్చలు, తన హష్‌తో ఆడుకున్న ఫోటోలను షేర్ చేశారు. మొత్తంగా గత వారం అంతా కూడా తాను చేసిన పనులివే అని చెప్పేశారు. ఇక ఇప్పుడు సమంత చేతిలో ఏ కొత్త ప్రాజెక్ట్ కూడా లేదు. నయనతార, సమంత, విజయ్ సేతుపతి కలిసి నటిస్తోన్న ఓ ద్విభాష చిత్రం మాత్రమే ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xPGFpk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...