Monday, 16 August 2021

పవన్ కళ్యాణ్ చెడుగుడుతో రికార్డ్స్ బ్రేక్.. భీమ్లా నాయక్ ఆన్ ఫైర్! దెబ్బకు చిరంజీవి, ప్రభాస్ అవుట్

వకీల్ సాబ్ సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన యమ జోష్‌లో ఉన్నారు. అటు రాజకీయ కార్యకలాపాలు చూసుకుంటూనే కమిటైన సినిమాలు చకచకా కంప్లీట్ చేసేస్తున్నారు. రెట్టింపు ఉత్సాహంతో వరుస సినిమాలు చేస్తున్న ఆయన.. రానాతో కలిసి 'అయ్యప్పనుమ్ కోషియుమ్‌' తెలుగు రీమేక్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రానికి అనే టైటిల్ డిసైడ్ చేసి 'భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లిమ్స్' రిలీజ్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో రికార్డులు తిరగరాస్తూ తెగ హంగామా చేస్తోంది. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే- సంభాషణలు అందిస్తుండగా.. సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. థమన్ బాణీలు కడుతున్నారు. అయితే ఫస్ట్ గ్లిమ్స్ వీడియోలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లుక్ చూసి ఆయన ఫ్యాన్స్ ఊగిపోయారు. బీమ్లా నాయక్ ఫైర్ చూశాక మెగా లోకంలో పూనకాలు వచ్చాయి. విడుదలైన క్షణం నుంచే భారీ స్థాయిలో వ్యూస్ తెచ్చుకుంటున్న ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తోటి హీరోల రికార్డులను బద్దలు కొట్టేస్తూ ఆన్ లైన్ సెన్సేషన్ అవుతోంది. 'భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లిమ్స్' విడుదలైన 24 గంటల్లోనే 8.49 మిలియన్ వ్యూస్ రాబట్టి టాలీవుడ్‌లో ఎక్కువ వ్యూస్ సాధించిన గ్లిమ్స్ వీడియోగా రికార్డు క్రియేట్ చేసింది. ఇలా తన అన్నయ్య చిరంజీవి పేరిట ఉన్న నెంబర్ వన్ రికార్డు (సైరా నరసింహా రెడ్డి 7.20 మిలియన్) తుడిచేశాడు తమ్ముడు పవన్ కళ్యాణ్. ఇకపోతే లైకుల పరంగా కూడా బీమ్లా నాయక్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. 24 గంటల్లో 728.6K లైకులు వచ్చాయి. ఫలితంగా ఇప్పటి వరకూ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్' పేరు మీద ఉన్న 394.4K లైకుల రికార్డు బద్దలైపోయింది. పవన్ లుంగీ మడిస్తే ఇలాగే ఉంటుంది మరి అంటూ ఈ రికార్డ్స్ చూసిన మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. మరోవైపు పవన్ పాత్రకే ప్రాధాన్యతనిస్తూ టైటిల్ అతడిపైనే పెట్టడం, వీడియో ఇలా కట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని దగ్గుబాటి రానా అభిమానులు ఫైర్ అవుతుండటం చూస్తున్నాం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3g8SWip
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...