Monday, 16 August 2021

దానికి చాలా సమయం పడుతుంది.. తన పెళ్లిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన శ్రీముఖి..

యాంకర్ .. ఈ పేరు వింటేనే ఆమె చేసే అల్లరి చక్కిలిగిలి పెడుతుంది. చాలాకాలం క్రితం యాంకర్‌గా బుల్లితెరపై అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ‘పటాస్’ అనే కార్యక్రమంతో ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది. ఇక అప్పుడప్పుడు సినిమాల్లో మెరుస్తూ అటు వెండి తెర, ఇటు బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న చిత్రం ‘’. శ్రీవాస్ 2 క్రియేటివ్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని గుడ్ ఫ్రెండ్స్, బొడ్డు అశోక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇ.సత్తిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సింగర్ మనో, రాజా రవీంద్ర, భరణిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని చాలాకాలం అయింది. కానీ, కరోనా వ్యాప్తి కారణంగా సినిమా విడుదల వాయిదాపడుతూ వస్తుంది. చాలారోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రీసెంట్‌గా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాను ఆగస్టు 19వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలిపారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శ్రీముఖి వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తాను పెళ్లి చేసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాను అని శ్రీముఖి. ప్రస్తుతం తన వయస్సు 28 సంవత్సరాలు అని అయితే 31 సంవత్సరాలు వచ్చేసరికి పెళ్లీ పీటలు ఎక్కాలని భావిస్తున్నట్లు ఆమె పేర్కొంది. అయితే మంచి వ్యక్తి భర్తగా దొరకడం కష్టమని దానికి చాలా టైమ్ పడుతుందని చెప్పిన ఈ బుల్లితెర రాములమ్మా.. ఏదైనా అదృష్టం మీద ఆధారపడి ఉంటుందని పేర్కొంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3iRVXWm
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...